Raghuramakrishnan Raju: పవన్ వార్ అంటే వైసీపీ కంగారు పడుతోంది

ABN , First Publish Date - 2022-12-19T16:43:22+05:30 IST

ఎన్ని గడపలు తొక్కినా ప్రజలు తొక్కుకుంటూ వైసీపీ (YCP)కి వ్యతిరేకంగా ఓటు వేస్తారని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు (Narsapuram MP Raghuramakrishnan Raju) వ్యాఖ్యానించారు.

Raghuramakrishnan Raju: పవన్ వార్ అంటే వైసీపీ కంగారు పడుతోంది
వార్ అంటే వైసీపీ కంగారు పడుతోంది

ఢిల్లీ: ఎన్ని గడపలు తొక్కినా ప్రజలు తొక్కుకుంటూ వైసీపీ (YCP)కి వ్యతిరేకంగా ఓటు వేస్తారని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు (Narsapuram MP Raghuramakrishnan Raju) వ్యాఖ్యానించారు. ఎంపీ మీడియాతో మాట్లాడారు. ‘‘పవన్ కళ్యాణ్ శత్రువుల పీడ వదిలేలా వారాహి వార్ అని పెట్టుకొని ఉంటారు. దానికి కూడా వైసీపీ నేతలు ట్వీట్లు చేస్తున్నారు. వారాహి వాహనం గురించి ఇకపై వైసీపీ నేతలు మాట్లాడకపోవడం మంచిది. పవన్ కళ్యాణ్(Pawan Kalyan) వార్ అంటున్నారు.. వైసీపీ లీడర్లు ఎందుకు కంగారు పడుతున్నారో అర్థం కావడం లేదు. ప్రతిపక్షాల ఓట్లను చీలనివ్వనని పవన్ కళ్యాణ్ అన్నారు. ఓట్లు చీలనివ్వనని పవన్ కళ్యాణ్ అన్నారు. గతంలో కూడా అదే జరిగింది. ఈసారి వైసీపీ ప్రభుత్వాన్ని ఉండనిస్తే ప్రజలను బతకనివ్వరని పవన్ అన్నారు. అందుకే వారాహి వాహనంతో వస్తున్న అని పవన్ కళ్యాణ్ అన్నారు. అణగారిన వర్గాలకు అధికారం రావాలని అన్నారు. వైసీపీలాగా ఒక రెడ్డి కూర్చుంటే అందరూ నిలబడడం కాదు. అందరితో కూడిన అద్భుతమైన సమాజం ఉండాలని పవన్ కళ్యాణ్ అన్నారు. ఓట్లు చీలకుండా చూస్తానన్న పవన్ కళ్యాణ్‌కి ధన్యవాదాలు. నవరత్నాలు (Navratnas) ఒక నాటకం. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను లబ్ధిదారులకు ఇవ్వకుండా చేస్తున్నారు. అమ్మఒడి (Amma odi) కన్నా ఎక్కువ బెనిఫిట్ వచ్చే వాటిని దక్కనివ్వకుండా చేస్తున్నారు. బీసీ సబ్ ప్లాన్ కింద వచ్చే నిధులను సహితం దోచేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంక్షేమ పథకాలు అందకుండా చేస్తున్నారు. వైసీపీకి ఉన్న ఉద్యోగులు, రైతులు అందరూ పోయారు.’’ అని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.

Updated Date - 2022-12-19T16:43:23+05:30 IST