భక్తులతో కిటకిటలాడిన శివాలయాలు

ABN , First Publish Date - 2022-11-06T23:40:44+05:30 IST

కార్తీక మాసం రెండవ ఆదివారం సందర్భంగా పంచారామ క్షేత్రం శ్రీక్షీరా రామలింగేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు పంచారామ క్షేత్రాల పేరుతో వచ్చే యాత్రీకులతో ఆలయం కిటకిటలాడింది.

భక్తులతో కిటకిటలాడిన శివాలయాలు
జుత్తిగలో సోమేశ్వరస్వామికి లక్షపత్రి పూజ

పాలకొల్లు అర్బన్‌, నవంబరు 6 : కార్తీక మాసం రెండవ ఆదివారం సందర్భంగా పంచారామ క్షేత్రం శ్రీక్షీరా రామలింగేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు పంచారామ క్షేత్రాల పేరుతో వచ్చే యాత్రీకులతో ఆలయం కిటకిటలాడింది. ఆలయం సమీపంలోని రేపాక వారి సత్రం లో దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు 1300 మందికి భోజనాలు ఏర్పాటుచేసారు. పలు రాష్ట్రాల నుంచి పంచారామ క్షేత్రాల పేరుతో వివిధ వాహనాల్లో సుమారు 25 వేల మంది వరకూ స్వామివారిని దర్శించుకున్నట్టు ఆలయ వర్గాల సమాచారం. ఈసందర్భంగా స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. కార్యక్రమాల్లో పాలక మండలి చైర్మన్‌ కోరాడ శ్రీనివాస్‌ ఈవో యాళ్ళ సూర్యనారా యణ, ట్రస్టు బోర్డు సభ్యులు, పరిసరాల దేవాదాయశాఖ ఈవోలు, సిబ్బంది, వలంటీర్లు పాల్గొన్నారు.

సోమేశ్వరుడికి లక్షపత్రి పూజ

పెనుమంట్ర: కార్తీకమాసం సందర్భంగా పెనుమంట్ర మండలంలోని జుత్తిగ ఉమా వాసుకి రవి సోమేశ్వర స్వామికి ఆదివారం మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, లక్ష బిల్వార్చన నిర్వహించారు. హైకోర్టు సీనియర్‌ న్యాయవాది ఎస్‌.స్వామి కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు రామకృష్ణశర్మ, ర్యాలీ వాసు శర్మ, గణేష్‌ శర్మ, పవన్‌ కుమార్‌ శర్మ, వేద పండితుడు వేమూరి ఫణీంద్ర శర్మ, ఈవో సాయి ప్రసాద్‌, గ్రామ సర్పంచ్‌ తమనంపూడి వీర్రెడ్డి, ఆర్‌.ఇంద్రయ్య పాల్గొన్నారు.

Updated Date - 2022-11-06T23:40:46+05:30 IST