ఫిర్యాదులు తక్షణం పరిష్కరించాలి : ఎస్పీ
ABN , First Publish Date - 2022-08-24T05:30:00+05:30 IST
పోలీస్ స్టేషన్‌లో అందే ఫిర్యాదులతోపాటు స్పందనలో వచ్చే ప్రతి ఫిర్యాదు తక్షణం పరిష్కారమయ్యేలా చూడాలని జిల్లా ఎస్పీ రవిప్రకాష్ సూచించారు.
పెంటపాడు,
ఆగస్టు 24: పోలీస్ స్టేషన్‌లో అందే ఫిర్యాదులతోపాటు స్పందనలో వచ్చే ప్రతి
ఫిర్యాదు తక్షణం పరిష్కారమయ్యేలా చూడాలని జిల్లా ఎస్పీ రవిప్రకాష్
సూచించారు. వార్షిక తనిఖీలో భాగంగా బుధవారం పెంటపాడు పోలీస్ స్టేషన్‌ను
ఆయన సందర్శించారు. తొలుత పెంటపాడు పోస్ట్ బేసిక్ పాఠశాలలో పోలీసులు
నిర్వహించిన డ్రిల్ పరిశీలించారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌లో రికార్డులను
పరిశీలించారు. అనంతరం మండలంలోని ప్రత్తిపాడు, అలంపురంలో రోడ్డు ప్రమాదాలు
జరిగే ప్రాంతాల్ని పరిశీలించారు. సీఐ సత్యనారాయణమూర్తి, ఎస్‌ఐ గంట్ల
సత్యనారాయణ, ఏఎస్‌ఐ కొప్పిశెట్టి సత్యనారాయణ సిబ్బంది పాల్గొన్నారు.