టీడీపీలో నూతనోత్సాహం

ABN , First Publish Date - 2022-12-03T00:17:24+05:30 IST

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్ర బాబునాయుడు ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిఆ్ల తాడేపల్లిగూడెంలో ‘ఇదేం కర్మ మన రాష్ర్టానికి’ కార్యక్రమంలో భాగంగా రోడ్‌ షో, సభకు ఉత్సాహంగా పార్టీ శ్రేణులు తరలివెళ్లారు.

టీడీపీలో నూతనోత్సాహం
గణపవరం మండలం నుంచి తాడేపల్లిగూడెంకు టీడీపీ నేతల ర్యాలీ

గణపవరం, డిసెంబరు 2: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్ర బాబునాయుడు ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిఆ్ల తాడేపల్లిగూడెంలో ‘ఇదేం కర్మ మన రాష్ర్టానికి’ కార్యక్రమంలో భాగంగా రోడ్‌ షో, సభకు ఉత్సాహంగా పార్టీ శ్రేణులు తరలివెళ్లారు. గణపవరం మండలం నుంచి నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో ర్యాలీగా బయళ్దేరారు. 25 గ్రామాల నుంచి టీడీపీ నేతలు, కార్యకర్త లు పిప్పర మండల కార్యాలయంలోకి చేరుకున్నారు. అక్కడ నుంచి మోటారు సైకిల్‌ ర్యాలీగా తరలి వెళ్లారు. పార్టీ మండల అధ్యక్షుడు ఇందుకూరి రామకృష్ణంరాజు, ఉంగుటూరు నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు అద్దేపల్లి వాసురాజు, జిల్లా కార్యదర్శి యాళ్ళ సుబ్బారావు, మొయ్యేరు అధ్యక్షుడు కానుమిల్లి చంటి, సీనియర్‌ నాయకులు అల్లూరి బదిరీ నారాయణ, కె.సురేంద్రకుమార్‌రాజు, కాపారం చిన్న, మధు ఉన్నారు.

ఉంగుటూరు, భీమడోలు, నిడమర్రు మండలాల నుంచి..

ఉంగుటూరు, డిసెంబరు 2 : తాడేపల్లిగూడెంలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు షో, బహిరంగ సభకు ఉంగుటూరు మండలంలో పాటు భీమడోలు, నిడమర్రు మండలాల నుంచి పెద్ద యెత్తున పార్టీ శ్రేణులు తరలివెళ్లారు. ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ కన్వీనర్‌ గన్ని వీరాంజనేయులు ఆధ్వర్యంలో వేలాది మంది కార్యకర్తలు జాతీయ రహదారి వెంబడి తరలి వెళ్లడంతో రహదారి అంతా పసుపుమయంగా మారింది.

Updated Date - 2022-12-03T00:17:26+05:30 IST

News Hub