AP News: చిత్తూరు జిల్లాలో వైసీపీ ఫ్లెక్సీల వివాదం - టీడీపీ నాయకుల అరెస్టు
ABN , First Publish Date - 2022-12-25T18:16:33+05:30 IST
Chittor: చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నడిమిగడిదేశిలో ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
Chittor: చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నడిమిగడిదేశిలో ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandrareddy) అనుచరులు.. టీడీపీ(TDP) పుంగనూరు లీగల్ సెల్ నాయకుడు నవీన్ కుమార్ యాదవ్ స్థలంలో ప్లైక్సీల ఏర్పాటు చేయడం వివాదానికి దారితీసింది. దీంతో పోలీసులు నవీన్‌ను అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. ఇటు నవీన్ అక్రమ అరెస్టును నిరసిస్తూ అతని భార్య హరిత పోలీసు స్టేషన్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. తన భర్త, కుటుంబ సభ్యులకు వైసీపీ (YCP) నాయకులతో ప్రాణహాని ఉందని ఆమె చెబుతున్నారు. పోలీస్ స్టేషన్ వద్దకు భారీ సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. టీడీపీ ముఖ్య నాయకులు 25 మందిని పోలీస్ స్టేషన్లో నిర్భందించినట్లు సమాచారం.