కస్టమర్లకు షాక్.. ఈ బ్యాంకుల్లో ఆ సేవలు ఇక మరింత ప్రియం.. భారీగా ఛార్జీలను..!

ABN , First Publish Date - 2022-12-01T10:23:29+05:30 IST

దేశ వ్యాప్తంగా బ్రాంచీలను కలిగి ఉన్న కొన్ని ప్రముఖ బ్యాంకులు తమ కస్టమర్లకు షాకిచ్చాయి. ఆయా బ్యాంకుల్లో లాకర్ ఫీజులను భారీగా పెంచేశాయి. బ్యాంకు బ్రాంచీలు ఉన్న ప్రాంతం..

కస్టమర్లకు షాక్.. ఈ బ్యాంకుల్లో ఆ సేవలు ఇక మరింత ప్రియం.. భారీగా ఛార్జీలను..!

ఇంటర్నెట్ డెస్క్: దేశ వ్యాప్తంగా బ్రాంచీలను కలిగి ఉన్న కొన్ని ప్రముఖ బ్యాంకులు తమ కస్టమర్లకు షాకిచ్చాయి. ఆయా బ్యాంకుల్లో లాకర్ ఫీజులను భారీగా పెంచేశాయి. బ్యాంకు బ్రాంచీలు ఉన్న ప్రాంతం, లాకర్ సై‌జులను బట్టి లాకర్ ఫీజులను అధిక మొత్తంలో పెంచాయి. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

బ్యాంకుల్లో కేవలం డబ్బులు మాత్రమే కాదు.. విలువైన వస్తువులు, డాక్యుమెంట్లను కూడా భద్రపరుచుకోవచ్చు. ఏటా కొంత మొత్తం చెల్లించడం ద్వారా కస్టమర్లు.. బ్యాంకుల్లో తమ విలువైన వస్తువులను, డాక్యుమెంట్లను లాకర్‌లలో భద్రపరుచుకోవచ్చు. ఈ విషయం అందిరికీ తెలిసిందే. అయితే.. తాజాగా SBI, HDFC, PNB, ICICI వంటి ప్రముఖ బ్యాంకులు లాకర్ల ఫీజులను భారీగా పెంచేశాయి. దీంతో ఆయా బ్యాంకుల్లో కస్టమర్లు లాకర్ సేవలు పొందాలంటే.. అధిక మొత్తంలో వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

SBI Bank తన వెబ్‌సైట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం.. బ్యాంకు బ్రాంచి ఉన్న ప్రదేశం, లాకర్ సైజులను బట్టి లాకర్ వార్షిక ఛార్జీలను రూ.500 నుంచి రూ.3వేల వరకు పెంచేసింది. మెట్రో, మెట్రో పాలిటన్ ప్రదేశాల్లో చిన్న, మధ్యతరహా, భారీ, అతిభారీ లాకర్ ఫీజులను వరుసగా రూ.2000, రూ.4000, రూ.8000, రూ12వేలుగా నిర్ణయించింది. అదే సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో లాకర్ల ఛార్జీలను రూ.1500, రూ.3000, రూ.6000, రూ.9వేలుగా నిర్ణయించింది.

HDFC Bank బ్యాంకు బ్రాంచి లోకేషన్, లాకర్ సైజును బట్టి వార్షిక ఫీజులను రూ.3000-20వేలుగా నిర్ణయించింది. మెట్రో, అర్బన్ ప్రదేశాల్లో స్మాల్ సైజ్ లాకర్‌కు రూ.3వేలు, మీడియం సైజు లాకర్లకు రూ.5వేలు, లార్జ్ సైజ్ లాకర్లకు రూ.10,000 చొప్పున చార్జీలను వసూలు చేయనుంది.

అదే ICICI Bank విషయానికి వస్తే.. స్మాల్ సైజ్ లాకర్ల‌కు రూ.1,200 నుంచి రూ.5వేల వరకూ వార్షిక ఫీజులుగా వసూలు చేయనుంది. అతి భారీ లాకర్ల ఫీజులను రూ.10వేల నుంచి రూ.22వేలుగా నిర్ణయించింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. వీటికి జీఎస్‌టీ ఛార్జీలు అదనం. ఇక పంజాబ్ నేషనల్ బ్యాంకు సైతం ఇతర బ్యాంకుల మార్గంలోనే నడిచింది. సెమీ అర్బన్ ప్రాంతాల్లో రూ.1250-రూ.2000.. అదే మెట్రో ప్రాంతాల్లో రూ.10వేల వరకు లాకర్ ఛార్జీల కింద వసూలు చేయనుంది.

Updated Date - 2022-12-01T10:58:34+05:30 IST