Twitter: ట్విటర్ ఉద్యోగుల్లో 25 శాతం మంది తొలగింపు?

ABN , First Publish Date - 2022-10-31T17:56:05+05:30 IST

సోషల్ నెట్‌వర్క్ కంపెనీ ట్విటర్‌ను (Twitter) గతవారమే కొనుగోలు చేసిన ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) ఒక కీలక ప్రణాళిక సిద్ధం చేశారా?, దానిని త్వరలోనే అమలు పరచబోతున్నారా ?.. అనే సందేహాలకు ఔననే సమాధానాలే వినిపిస్తున్నాయి.

Twitter: ట్విటర్ ఉద్యోగుల్లో 25 శాతం మంది తొలగింపు?
Elon musk

న్యూఢిల్లీ: సోషల్ నెట్‌వర్క్ కంపెనీ ట్విటర్‌ను (Twitter) గతవారమే కొనుగోలు చేసిన ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) ఒక కీలక ప్రణాళిక సిద్ధం చేశారా?, దానిని త్వరలోనే అమలు పరచబోతున్నారా ?.. అనే సందేహాలకు ఔననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ఉద్యోగుల తొలగింపునకు సంబంధించి మొదటి రౌండ్‌లో సిబ్బందిలోని పావువంతు లేదా 25 శాతం మందిపై వేటు వేయాలని కంపెనీ భావిస్తోందని సమాచారం. ఈ మేరకు ప్రణాళికలు సిద్ధమయ్యాయని వాషింగ్టన్ పోస్ట్ (Washington Post) పేర్కొంది. ఈ వ్యవహారంపై అవగాహన ఉన్న వర్గాలు ఈ విషయాన్ని తెలిపాయని పేర్కొంటూ సోమవారం ఒక రిపోర్టును ప్రచురించింది. ఎలాన్ మస్క్‌కు దీర్ఘకాలంగా లీగల్ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తున్న సెలబ్రిటీ లాయర్ అలెక్స్ స్పిరో‌ సారధ్యంలో ఉద్యోగుల తొలగింపు అంశంపై చర్చ జరుగుతోందని తెలిపింది. కాగా 2021 చివరి నాటికి ట్విటర్‌ ఉద్యోగుల సంఖ్య 7000లకుపైగా ఉందని రెగ్యులేటరీ ఫైలింగ్ డేటా పేర్కొంది. కాగా నవంబర్ 1న స్టాక్ గ్రాంట్ బకాయిల చెల్లింపు తప్పించుకునేందుకు ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమవుతున్నారంటూ న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన రిపోర్టును ఎలాన్ మస్క్ ఖండించిన విషయం తెలిసిందే.

కాగా ట్విటర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పరాగ్ అగర్వాల్, ఫైనాన్స్ చీఫ్ నెడ్ సెగల్, లీగల్ అఫైర్స్, పాలసీ చీఫ్ విజయ గద్దెలను మస్క్ ఇప్పటికే తొలగించిన విషయం తెలిసిందే. 44 బిలియన్ డాలర్ల కొనుగోలు ఒప్పందం పూర్తయ్యిన అనంతరం వీరిని తొలగించిన విషయం తెలిసిందే.

Updated Date - 2022-10-31T19:59:34+05:30 IST