Twitter Blue tick: ట్విటర్ బాస్ కీలక ప్లాన్.. రూ.1600 ఛార్జీ చెల్లిస్తేనే..
ABN , First Publish Date - 2022-10-31T19:56:22+05:30 IST
ఇటివలే ట్విటర్‌ను (Twitter) టేకోవర్ చేసుకున్న ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon musk) ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇందులో భాగంగా కొత్తగా ట్విటర్ బ్లూ టిక్ సబ్‌స్ర్కిప్షన్ (Twitter Blue subscription) కోరుకునే యూజర్ల నుంచి 19.99 డాలర్ల (దాదాపు రూ.1600) చార్జీ వసూలు చేయాలని మస్క్ యోచిస్తున్నారు.
కాలిఫోర్నియా: ఇటివలే ట్విటర్‌ను (Twitter) టేకోవర్ చేసుకున్న ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon musk) ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇందులో భాగంగా కొత్తగా ట్విటర్ బ్లూ టిక్ సబ్‌స్ర్కిప్షన్ (Twitter Blue subscription) కోరుకునే యూజర్ల నుంచి 19.99 డాలర్ల (దాదాపు రూ.1600) చార్జీ వసూలు చేయాలని మస్క్ యోచిస్తున్నారు. అకౌంట్ హోల్డర్ గుర్తింపును వేరిఫై చేసే ‘బ్లూ టిక్’ (Blue tick) చార్జీల ద్వారా ఆదాయాన్ని ఆర్జించాలనేది కంపెనీ ఉద్దేశ్యమని మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి.
ఈ ప్లాన్ ప్రకారం.. ఇప్పటికే వెరిఫికేషన్ బ్లూ టిక్ పొందిన యూజర్లు 90 రోజుల వ్యవధిలో సబ్‌స్ర్కైబ్ చేసుకోవాలి. లేదంటే బ్లూ చెక్ మార్క్‌ను కోల్పోవాల్సి ఉంటుందని రిపోర్టులు చెబుతున్నాయి. మరోవైపు నెలకు 4.99 డాలర్ల ఛార్జి చెల్లింపుపై అదనపు ఫీచర్లను యూజర్లకు అందివ్వాలని మస్క్ భావిస్తున్నారు. ఈ విధానాన్ని గడువులోగా ప్రవేశపెట్టాలని, లేదంటే ఉద్యోగాలు ఊడిపోతాయని ఉద్యోగులను మస్క్ హెచ్చరించినట్టు టెక్ న్యూస్ పోర్టల్ ‘ది వెర్జ్’ (The Verge) పేర్కొంది. ఈ కొత్త విధానాన్ని నవంబర్ 7లోగా ప్రవేశపెట్టాలని, ఇందుకోసం అవసరమైతే 24 గంటలపాటు కష్టపడాలని గడువు విధించినట్టు పేర్కొంది. కాగా గత ఆదివారం మస్క్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ‘‘ వెరిఫికేషన్‌కు సంబంధించిన ప్రక్రియ పునరుద్ధరణ జరుగుతోంది’’ అని ట్వీట్ చేశారు.