UPSC: ఇంటర్‌తో సైన్యంలో ఉన్నత ఉద్యోగం

ABN , First Publish Date - 2022-12-28T14:45:44+05:30 IST

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(Union Public Service Commission) (యూపీఎస్సీ) ఎన్‌డీఏ అండ్‌ ఎన్‌ఏ 2023(1) ప్రకటనను విడుదల చేసింది. సైన్యం (army)లో

UPSC: ఇంటర్‌తో సైన్యంలో ఉన్నత ఉద్యోగం
సైన్యంలో ఉన్నత ఉద్యోగం

ఖాళీలు 395

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(Union Public Service Commission) (యూపీఎస్సీ) ఎన్‌డీఏ అండ్‌ ఎన్‌ఏ 2023(1) ప్రకటనను విడుదల చేసింది. సైన్యం (army)లో ఉన్నతమైన హోదాలో పనిచేయాలనుకునే వారికి ఈ పరీక్ష మంచి అవకాశం. ఇంటర్మీడియట్‌ (Intermediate) ఉత్తీర్ణులైన వారు, ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం చదువుతున్న వారు అర్హులు. మహిళలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎన్‌డీఏ అండ్‌ ఎన్‌ఏ 2023(1)

  • నేషనల్‌ డిఫెన్స్‌ అకాడెమీలో 370- ఆర్మీ 208(10 మహిళలకు), నేవీ 42(3 మహిళలకు)

  • ఎయిర్‌ ఫోర్స్‌ అకాడెమీ- ఫ్లయింగ్‌ 92(2 మహిళలకు); గ్రౌండ్‌ డ్యూటీస్‌(టెక్నికల్‌) 18(2 మహిళలకు);

    గ్రౌండ్‌ డ్యూటీ(నాన్‌ టెక్నికల్‌) 10(2 మహిళలకు)

  • నేవల్‌ అకాడమీ(10+2 క్యాడెట్‌ ఎంట్రీ స్కీం)లో 25 ఖాళీలున్నాయి. 25 సీట్లు పురుషులకే కేటాయించారు.

అర్హత: ఆర్మీ వింగ్‌ పోస్టులకు ఏదైనా ఇంటర్మీడియట్‌(10+2) ఉత్తీర్ణులై ఉండాలి. ఎయిర్‌ఫోర్స్‌, నేవల్‌ వింగ్స్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంటర్మీడియట్‌(10+2) ఎంపీసీ గ్రూప్‌తో ఉత్తీర్ణులై ఉండాలి. ద్వితీయ సంవత్సరం చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

వయసు: 2004 జూలై 2 - 2007 జూలై 1 మధ్య జన్మించినవారు అర్హులు. నిర్దేశిత శారీరక ప్రమాణాలు తప్పనిసరి.

ఎంపిక విధానం: రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

పరీక్ష విధానం: ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. ప్రశ్నలు ఆబ్జెక్టివ్‌ టైప్‌లో ఉంటాయి. రెండు పేపర్లకు కలిపి కేటాయించిన మొత్తం మార్కులు 900. ప్రశ్న పత్రం ఇంగ్లీష్/హిందీలో ఉంటుంది. పేపర్‌-1 మేథ్స్‌ 300 మార్కులకు ఉంటుంది. ఇందులో 120 ప్రశ్నలు ఇస్తారు. ప్రతి ప్రశ్నకు రెండున్నర మార్కులు. పరీక్ష వ్యవధి రెండున్నర గంటలు. పేపర్‌-2 జనరల్‌ ఎబిలిటీస్‌ విభాగానికి సంబంధించింది. దీనికి కేటాయించిన మొత్తం మార్కులు 600. మొత్తం 150 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు నాలుగు మార్కులు ఉంటాయి. పరీక్ష వ్యవధి రెండున్నర గంటలు. రెండో పేపర్‌లో పార్ట్‌-ఎ(ఇంగ్లీష్‌), పార్ట్‌-బి(జనరల్‌ నాలెడ్జ్‌) ఉంటాయి. ఇంగ్లీష్‌ నుంచి 50 ప్రశ్నలు, జనరల్‌ నాలెడ్జ్‌కు సంబంధించి ఫిజిక్స్‌-25; కెమిస్ట్రీ-15; జనరల్‌ సైన్స్‌-10; చరిత్ర, స్వాతంత్రోద్యమం-20, జాగ్రఫీ-20, కరెంట్‌ అఫైర్స్‌-10 ప్రశ్నలు అడుగుతారు. నెగెటివ్‌ మార్కింగ్‌ విధానం ఉంది. తప్పుగా గుర్తించిన సమాధానానికి 1/3వ వంతు మార్కు కోత విధిస్తారు. పరీక్షలో అర్హత సాధించడానికి ప్రతి సబ్జెక్టులో 25 శాతం మార్కులు తప్పనిసరిగా రావాలి. అర్హత సాధించినవారిలో మెరిట్‌ ప్రకారం ఇంటర్వ్యూకి పిలుస్తారు. వీరికి సర్వీస్‌ సెలెక్షన్‌ బోర్డ్‌(ఎస్‌ఎస్‌బీ) ఆధ్వర్యంలో యూపీఎస్సీ... ఇంటెలిజెన్స్‌ అండ్‌ పర్సనాలిటీ టెస్టులు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా గ్రూప్‌ టెస్టులు, గ్రూప్‌ డిస్కషన్‌, గ్రూప్‌ ప్లానింగ్‌, అవుట్‌డోర్‌ గ్రూప్‌ టాస్క్‌లను ఐదు రోజులపాటు రెండంచెల్లో నిర్వహిస్తారు. తొలిరోజు పరీక్షల్లో అర్హత సాధించినవారికే మిగిలిన నాలుగు రోజులు పాల్గొనే అవకాశం ఉంటుంది. రాత పరీక్ష, సర్వీస్‌ సెలెక్షన్‌ బోర్డు నిర్వహించిన పరీక్షల్లో వచ్చిన మొత్తం మార్కులు, వైద్య పరీక్షల ఆధారంగా తుది నియామకం ఉంటుంది.

women-long-jump.gif

శిక్షణ, ఉద్యోగం: ఎంపికైన వారు నేషనల్‌ డిఫెన్స్‌ అకాడెమీ, పుణెలో... బీటెక్‌, బీఎస్సీ, బీఏ కోర్సులు; నేవల్‌ అకాడెమీ, ఎజిమళలో బీటెక్‌(నేవల్‌ ఆర్కిటెక్చర్‌) విద్య అభ్యసించవచ్చు. వసతి, భోజనం, దుస్తులు అన్నీ ఉచితమే. విజయవంతంగా చదువు పూర్తి చేసుకున్న వారికి జేఎన్‌యూ, న్యూఢిల్లీ డిగ్రీలు అందిస్తుంది. అనంతరం సంబంధిత విభాగాల ట్రేడ్‌ శిక్షణకు పంపుతారు. ఏడాది నుంచి 18 నెలల వరకు శిక్షణ ఉంటుంది. ఈ సమయంలో ప్రతి నెలా రూ.56,100/- స్టయిఫెండ్‌ ఇస్తారు. శిక్షణ పూర్తయి విధుల్లోకి చేరిన తర్వాత అందరికీ లెవెల్‌ 10 మూలవేతనం రూ.56,100/- చెల్లిస్తారు. దీనికి అదనంగా మిలిటరీ సర్వీస్‌ పే రూ.15,500 ఉంటుంది. ఆర్మీలో లెఫ్టినెంట్‌; నేవీలో సబ్‌ లెఫ్టినెంట్‌, ఎయిర్‌ ఫోర్స్‌లో ఫ్లయింగ్‌ హోదాలు కేటాయిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

దరఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు చెల్లించాల్సిన అవసరం లేదు.

చివరి తేదీ: జనవరి 10

పరీక్ష తేదీ: ఏప్రిల్‌ 16

వెబ్‌సైట్‌: www.upsc.gov.in

Upsc-logo.gif

Updated Date - 2022-12-28T14:48:59+05:30 IST