Home » Army
భారత గగనతల రక్షణ సామర్థ్యాన్ని పెంపొందించే దిశగా కీలక ముందడుగు పడింది. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ తరహాలో... రష్యా గగనతలానికి రక్షణ వలయంగా నిలుస్తున్న....
జమ్మూ-కశ్మీర్లోని కిష్టావర్ జిల్లాలో ఆదివారం జరిగిన ఎన్కౌంటర్లో ఓ ఆర్మీ అధికారి ప్రాణాలు కోల్పోగా, ముగ్గురు జవాన్లు గాయపడ్డారు.
ప్రతి దీపావళి పండుగను సరిహద్దుల్లోని ఫ్రంట్ పోస్ట్ బలగాలతో జరుపుకోవడం ప్రధాని పదేళ్లుగా కొనసాగిస్తుండగా, దసరా పర్వదినాన ఆయుధ పూజ నిర్వహించడాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించారు. 2019లో రక్షణ శాఖ మంత్రి ఈ ఆయుధ పూజ ప్రారంభించారు.
చినార్ కార్ప్స్ అధికారి ఒకరు ఈ ఘటనను వివరిస్తూ, శుక్రవారం రాత్రి ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్లో భాగంగా వెళ్లున్న ఆర్మీ వ్యాను కుల్గాంలోని డీహెచ్ పోర ప్రాంతంలో రోడ్డుపై జారడంతో బోల్తా పడిందన్నారు. ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్లో ఉండగా ఈ ఘటన జరిగినట్టు చెప్పారు.
హైఫా నగరానికి సమీపంలోని బిన్యమిన ప్రాంతంలో ఉన్న ఇజ్రాయెల్ సైనిక స్థావరంపై హెజ్బొల్లా రాకెట్లు, డ్రోన్లతో దాడి జరిపింది.
ఏళ్ల తరబడి జవాన్లు ఆయుధపూజ చేయడం సంప్రదాయంగా వస్తోందని, ఈరోజు విజయానికి సంకేతమని, శ్రీరాముడు రావణుని సంహరించిన రోజని రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఇది కేవల విజయం కాదు, మానవతావాదాన్ని దక్కిన విజయమని అన్నారు.
పేజర్ పేలుడు వ్యవస్థ.. భారత్లోకి ప్రవేశించకుండా ఎక్కడికక్కడ అడ్డుకోవాల్సిన అవసరం ఉందని, హిజ్బుల్లా తీవ్రవాదులకు చెందిన పేజర్లు, వాకీ-టాకీలను పేల్చివేయడం ద్వారా లెబనాన్కు ఇజ్రాయెల్ మాస్టర్స్ర్టోక్ ఇచ్చిందని భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీ అన్నారు.
రహదారులు, జలాశయాలు, రైల్వే ట్రాక్లను ఆక్రమించి నిర్మించిన ఏ మతానికి సంబంధించిన కట్టడాలనైనా తొలగించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
డీఆర్డీఏ సహకారంతో ఆధునిక పరిజ్ఞానంతో మేడిన్ ఇండియా ఉత్పత్తిగా మెషిన్ గన్స్ను తయారు చేసి ఆర్మీకి అందిస్తున్నామని లోకేశ్ మిషనరీ పరిశ్రమ ప్రతినిధి లోకేశ్వరరావు తెలిపారు.
మావోయిస్టుల ఉద్యమానికి ఆయువుపట్టుగా ఉన్న ఛత్తీ్సగఢ్లోని అబూజ్మడ్ అటవీ ప్రాంతంలో భారత సైన్యం పాగా వేయనుంది.