Central Home: CISFలో కానిస్టేబుల్‌ పోస్టులు

ABN , First Publish Date - 2022-11-17T11:43:51+05:30 IST

కేంద్ర హోం మంత్రిత్వశాఖ(Central Home Ministry) ఆధ్వర్యంలోని సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌(Central Industrial Security Force)(సీఐఎస్‌ఎఫ్‌)... వివిధ సెక్టార్లలో కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.

Central Home: CISFలో కానిస్టేబుల్‌ పోస్టులు
కానిస్టేబుల్‌ పోస్టులు

  • సీఐఎస్‌ఎఫ్‌లో కానిస్టేబుల్‌/ట్రేడ్స్‌మన్‌ పోస్టులు

  • మొత్తం ఖాళీలు 787

కేంద్ర హోం మంత్రిత్వశాఖ(Central Home Ministry) ఆధ్వర్యంలోని సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌(Central Industrial Security Force)(సీఐఎస్‌ఎఫ్‌)... వివిధ సెక్టార్లలో కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.

సెక్టార్లు: నార్తెర్న్‌, ఎన్‌సీఆర్‌, వెస్ట్రన్‌, సెంట్రల్‌, ఈస్ట్రన్‌, సదరన్‌, సౌత్‌ ఈస్ట్రన్‌, నార్తెర్న్‌ ఈస్ట్రన్‌.

పోస్టు/ట్రేడ్‌, ఖాళీల వివరాలు

మొత్తం ఖాళీల సంఖ్య: 787(పురుషులు-641, మహిళలు-69, ఎక్స్‌సర్వీస్‌మన్‌-77)

అర్హత: పదో తరగతి. ఇండస్ట్రియల్‌ ట్రెయినింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ శిక్షణ పొందిన వారికి ప్రాధాన్యం ఉంటుంది.

వయోపరిమితి: 2022 ఆగస్టు 1 నాటికి 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. అభ్యర్థులు 1999 ఆగస్టు 2 కంటే ముందు, 2004 ఆగస్టు 1 తరవాత జన్మించి ఉండకూడదు.

శారీరక ప్రమాణాలు: పురుష అభ్యర్థులు:ఎత్తు-170 సెం.మీ., ఛాతీ-80-85 సెం.మీ.; మహిళా అభ్యర్థులు: ఎత్తు-157 సెం.మీ. ఉండాలి.

జీతభత్యాలు: రూ.21,700-రూ.69,100

నియామక ప్రక్రియ: ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌(పీఎస్‌టీ); ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్‌(పీఈటీ), డాక్యుమెంటేషన్‌, ట్రేడ్‌ టెస్ట్‌, ఓఎంఆర్‌బేస్డ్/కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌(సీబీటీ), మెడికల్‌ ఎగ్జామినేషన్‌, రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు రుసుము: రూ.100. ఎస్సీ, ఎస్టీ, ఈఎస్‌ఎం, మహిళా అభ్యర్థులకు దరఖాస్తు రుసుము నుంచి మినహాయింపు ఉంటుంది.

రాత పరీక్ష విధానం: పీఎస్‌టీ, పీఈటీ, డాక్యుమెంటేషన్‌, ట్రేడ్‌ టెస్టులో అర్హత సాధించిన అభ్యర్థులు రాత పరీక్షకు ఎంపికవుతారు. పరీక్ష వ్యవధి 2 గంటలు. ప్రశ్న పత్రానికి కేటాయించిన మార్కులు 100. మొత్తం 100 మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు ఇస్తారు. జనరల్‌ అవేర్‌నె్‌స/జనరల్‌ నాలెడ్జ్‌, ఎలిమెంటరీ మేథ్స్‌, ఎనలిటికల్‌ ఆప్టిట్యూడ్‌, హిందీ/ఇంగ్లీష్‌లో ప్రాథమిక పరిజ్ఞానాన్ని పరీక్షించే సామర్థ్యం తదితరాలపై ప్రశ్నలు అడుగుతారు. ఇంగ్లీష్/హిందీ మాధ్యమాల్లో ప్రశ్న పత్రం ఉంటుంది. నెగెటివ్‌ మార్కింగ్‌ లేదు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం: నవంబరు 21

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబరు 20

వెబ్‌సైట్‌: https://cisfrectt.in/comd.gif

Updated Date - 2022-11-17T11:45:23+05:30 IST