Home » Amit Shah
‘‘స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు అందరికీ అందేలా అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం దేశప్రజలకు ఒక రక్షణ కవచంలా మారింది. ఈ రాజ్యాంగాన్ని బీజేపీ ఎత్తివేయాలని చూస్తోంది.
అంబేడ్కర్, సమానత్వం అనేవి ఆయన (అమిత్‌షా) ఆలోచనల్లో కూడా లేవని, ఆయన సిద్ధాంతం, భావజాలం నుంచి ఇవి కనుమరుగయ్యాయని ప్రియాంక్ ఖర్గే విమర్శించారు.
దేశంలోని అన్ని జిల్లాల్లోనూ 'బాబాసాహెబ్ అంబేడ్కర్ సమ్మాన్ మార్చ్' నిర్వహించాలని కోరుతూ పార్టీ నేతలందరికీ ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్) కెసీ వేణుగోపాల్ ఒక సర్క్యులర్ జారీ చేశారు.
పార్లమెంటులో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షాను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చెయ్యాలని కాంగ్రెస్, వామపక్ష సంఘాలు, దళిత సంఘాల నేతలు డిమాండ్ చేశారు.
‘‘రాహుల్‌గాంధీ ప్రతి రోజూ ఇంట్లో దేవుడికి మొక్కినా.. ఫొటోలు తీయించుకుని ప్రచారం చేసుకోరు. మోదీ, అమిత్‌షాలు మాత్రం దేవుడిని మొక్కినప్పుడు ఫొటోలు తీయించుకుని మరీ ప్రచారం చేసుకుంటారు.
అంబేడ్కర్‌ను కించపరిచిన అమిత్‌షాను కేంద్ర మంత్రివర్గం నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు.
అంబేడ్కర్‌పై అమిత్‌షా చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని.. గురువారం పార్లమెంటులో చోటుచేసుకున్న ఘటనలు అందులో భాగమేనని కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో విపక్షనేత రాహుల్‌గాంధీ ఆరోపించారు.
సున్నితమైన అంశాలపై ఒక్కోసారి మంచి ఉద్దేశంతో మాట్లాడినా, వాటిని వక్రీకరించే వారుంటారని చంద్రబాబు తెలిపారు. ఇదే సమయంలో గతంలో వ్యవసాయం దండగ అని తాను అనని మాటను అన్నట్లు తప్పుడు ప్రచారం చేసిన విషయాన్ని సీఎం గుర్తుచేసుకున్నారు. ఇవాళ అంబేద్కర్ విషయమై ఢిల్లీలో జరుగుతున్న వ్యవహారం ఈ తరహాలోనే ఉందని..
రాజ్యాంగా నిర్మాత బీఆర్ అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ క్రమంలో ఆయనపై ప్రివిలేజ్ మోషన్ ఇవ్వాలని భావిస్తుంది. అందుకోసం గురువారం సభలో ఎంపీ మల్లికర్జున్ ఖర్గే నోటీసులు ఇచ్చారు.
స్వాతంత్య్ర పోరాటం చేస్తుంటే బీజేపీ నేతలు బ్రిటిష్ వారికి తాబేదార్లుగా పని చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. అమిత్ షా వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించాలని అన్నారు.