Home » Central Govt
కేంద్రప్రభుత్వంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి కేంద్రం తీరని అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. కేంద్ర చర్యల వల్ల పోలవరం ప్రాజెక్టు ప్రయోజనాలు దెబ్బ తింటాయని ఆరోపించారు.
గ్రామాల్లో ఉపాధి హామీ పథకం కింద చేపట్టే నిర్మాణ పనులు సకాలంలో పూర్తికావడంలేదు. ఆర్థిక సంవత్సరం ముగిసే సమయంలో హడావుడిగా పనుల ప్రతిపాదన చేయడం, ఆ తర్వాత నిర్దేశిత గడువులోగా పనులు పూర్తికాకపోవడం, బిల్లులు పెండింగ్లో ఉండడం మామూలైపోయింది.
అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ మళ్లీ అధికారం కోసం రైతుల ఆత్మ స్థైర్యం దెబ్బ తీసే ప్రయత్నం చేస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. తమ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కృషి చేస్తోందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.
Bulldozer Justice: రూల్స్కు విరుద్ధంగా ఒక్క ఇల్లును కూల్చివేసినా అది రాజ్యాంగానికి విరుద్ధమని పేర్కొన్న సుప్రీం కోర్టు.. బుల్డోజర్ న్యాయం మీద బుధవారం తీర్పు వెలువరించింది. ఇలాంటి సందర్భాల్లో వ్యవహరించాల్సిన విషయమై దేశం మొత్తానికి వర్తించే విధంగా సంచలన తీర్పు ఇచ్చింది.
క్రమ్ మిస్రీ పదవీకాలం నవంబర్ 30వ తేదీతో ముగియాల్సి ఉందని, అయితే ఎఫ్ఆర్ 56 (డీ) ప్రకారం 2026 జూలై 14వ తేదీ వరకూ కానీ తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకూ కానీ ఆయన పదవీకాలాన్ని పొడిగిస్తూ కేబినెట్ అపాయింట్స్మెంట్ కమిటీ నిర్ణయం తీసుకున్నట్టు ఆ ప్రకటన తెలిపింది.
ప్రసార మాధ్యమాల్లో తప్పుడు వార్తలు, సమాచారాన్ని ఎదుర్కొనేందుకు కేంద్రం కొత్త నిబంధనలు రూపొందించనుంది.
ప్రభుత్వం ప్రైవేటు ఆస్తుల్ని స్వాధీనం చేసుకునే విషయంలో సుప్రీంకోర్టు చరిత్రాత్మకమైన తీర్పు ఇచ్చింది. ప్రైవేటు యాజమాన్యంలో ఉన్న అన్ని ఆస్తులనూ ఉమ్మడి ప్రయోజనం కోసం ప్రభుత్వాలు స్వాధీనం చేసుకోవడానికి వీల్లేదని తేల్చిచెప్పింది.
న్యాయ సంస్కరణలను చేపడుతున్న కేంద్ర ప్రభుత్వం... నేరం- శిక్ష విషయంలో హేతుబద్ధత లోపించిన తీర్పులను పునఃసమీక్షించాలని యోచిస్తోంది..
విమాన ప్రయాణాల్లో ఇంటర్నెట్ వినియోగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. విమానాలు భూమట్టానికి 3,000 మీటర్ల (సుమారు 9,843 అడుగులు) ఎత్తుకు చేరుకున్న తర్వాత మాత్రమే ప్రయాణీకులు వైఫై, ఇతర ఇంటర్నెట్ సేవలను ఉపయోగించడానికి అనుమతి ఉంటుందని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
జార్ఖండ్లో సీపీఐ పార్టీ 9 సీట్లలో సొంతగా పోటీ చేస్తుందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పష్టం చేశారు. మహారాష్ట్రాలో ఇండియా కూటమి పొత్తులో భాగంగా ఒక స్థానంలో పోటీ చేస్తుందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి మోదీ కాంగ్రెస్ రాష్ట్రాలను విమర్శించడం సిగ్గుచేటు అని నారాయణ అన్నారు.