Recruitment: టెన్త్ ఉత్తీర్ణతతో సెంట్రల్ రైల్వేలో అప్రెంటిస్‌లు
ABN , First Publish Date - 2022-12-19T11:56:45+05:30 IST
ముంబయి(Mumbai)లోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్(Railway Recruitment Cell).. సెంట్రల్ రైల్వే పరిధిలోని వర్క్‌షాప్‌లు/యూనిట్లలో వివిధ ట్రేడుల్లో
ఖాళీలు 2422
ముంబయి(Mumbai)లోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్(Railway Recruitment Cell).. సెంట్రల్ రైల్వే పరిధిలోని వర్క్‌షాప్‌లు/యూనిట్లలో వివిధ ట్రేడుల్లో 2422 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
క్లస్టర్ వారీగా ఖాళీలు
ముంబయి క్లస్టర్: క్యారేజ్ అండ్ వ్యాగన్(కోచింగ్) వాడి బందర్-258; కల్యాణ్ డీజిల్ షెడ్-50; కుర్లా డీజిల్ షెడ్-60; సీనియర్ డీఈఈ(టీఆర్‌ఎస్)కల్యాణ్-179; సీనియర్ డీఈఈ(టీఆర్‌ఎస్)కుర్లా-192; పరేల్ వర్క్‌షాప్-313; మాతుంగ వర్క్‌షాప్-547; ఎస్‌అండ్‌టి బైతుల్లా వర్క్‌షాప్-60.
భూపాల్ క్లస్టర్: క్యారేజ్ అండ్ వ్యాగన్ డిపో-122; ఎలక్ట్రిక్ లోకోషెడ్, భుసావల్-80; ఎలక్ట్రిక్ లోకోమోటివ్ వర్క్‌షాప్-118; మన్మాడ్ వర్క్‌షాప్-51; టీఎండబ్ల్యూ నాసిక్ రోడ్-47.
పుణె క్లస్టర్: క్యారేజ్ అండ్ వ్యాగన్ డిపో-31, డీజిల్ లోకోషెడ్-121
నాగ్‌పూర్ క్లస్టర్: ఎలక్ట్రిక్ లోకోషెడ్-48; క్యారేజ్ అండ్ వ్యాగన్ డిపో-66
షోలాపూర్ క్లస్టర్: క్యారేజ్ అండ్ వ్యాగన్ డిపో-58; కుర్దువాడి వర్క్‌షాప్-21
ట్రేడులు: ఫిట్టర్, మెషినిస్ట్, షీట్ మెటల్ వర్కర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, కార్పెంటర్, మెకానిక్ మెషిన్ టూల్స్ మెయింటెనెన్స్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామ్ అసిస్టెంట్, మెకానిక్, పెయింటర్.
అర్హత: పదోతరగతి, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి
వయోపరిమితి: 2022 డిసెంబరు 15 నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి
శిక్షణ కాలం: ఏడాది
ఎంపిక ప్రక్రియ: మెట్రిక్యులేషన్, ఐటీఐ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా
దరఖాస్తు ఫీజు: రూ.100
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 15
వెబ్‌సైట్: https://www.rrccr.com/Home/Home