Recruitment: తెలంగాణలో జేఎల్ పోస్టులు భర్తీ
ABN , First Publish Date - 2022-12-14T16:39:01+05:30 IST
జూనియర్ లెక్చరర్ పోస్టుల(Junior Lecturer Posts) భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(Tspsc) (టీఎస్‌పీఎస్సీ) నోటిఫికేషన్ జారీ చేసింది.
ప్రభుత్వ జూనియర్ కళాశాల(Govt Junior College)ల్లో 1392 జూనియర్ లెక్చరర్ పోస్టుల(Junior Lecturer Posts) భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(Tspsc) (టీఎస్‌పీఎస్సీ) నోటిఫికేషన్ జారీ చేసింది. మల్టీజోన్-1లో 724, మల్టీజోన్-2లో 668 పోస్టులున్నాయి.
సబ్జెక్టు వారీగా ఖాళీలు
1. అరబిక్: 2 పోస్టులు
2. బోటనీ: 113 పోస్టులు
3. బోటనీ(ఉర్దూ మీడియం): 15 పోస్టులు
4. కెమిస్ట్రీ: 113 పోస్టులు
5. కెమిస్ట్రీ(ఉర్దూ మీడియం): 19 పోస్టులు
6. సివిక్స్: 56 పోస్టులు
7. సివిక్స్(ఉర్దూ మీడియం): 16 పోస్టులు
8. సివిక్స్(మరాఠీ మీడియం): 1 పోస్టు
9. కామర్స్: 50 పోస్టులు
10. కామర్స్(ఉర్దూ మీడియం): 7 పోస్టులు
11. ఎకనామిక్స్: 81 పోస్టులు
12. ఎకనామిక్స్(ఊర్దూ మీడియం): 15 పోస్టులు
13. ఇంగ్లీష్: 153 పోస్టులు
14. ఫ్రెంచ్: 02
15. హిందీ: 117 పోస్టులు
16. హిస్టరీ: 77 పోస్టులు
17. హిస్టరీ(ఉర్దూ మీడియం): 17 పోస్టులు
18. హిస్టరీ(మరాఠీ మీడియం): 1 పోస్టులు
19. మేథ్స్: 154 పోస్టులు
20. మేథ్స్(ఉర్దూ మీడియం): 9 పోస్టులు
21. ఫిజిక్స్: 112 పోస్టులు
22. ఫిజిక్స్(ఉర్దూ మీడియం): 18 పోస్టులు
23. సంస్కృతం: 10 పోస్టులు
24. తెలుగు: 60 పోస్టులు
25. ఉర్దూ: 28 పోస్టులు
26. జువాలజీ: 128 పోస్టులు
27.జువాలజీ(ఉర్దూ మీడియం): 18 పోస్టులు
అర్హతలు: సంబంధిత సబ్జెక్టు/భాషలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి
వయోపరిమితి: 2022 జూలై 1 నాటికి 18-44 సంవత్సరాల మధ్య ఉండాలి
జీతభత్యాలు: నెలకు రూ.54,220- రూ.1,33,630
అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు: రూ.200
పరీక్ష ఫీజు: రూ.120
ఎంపిక విధానం: రాత పరీక్ష(ఆబ్జెక్టివ్ టైప్) ఆధారంగా
రాత పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, హనుమకొండ, నిజామాబాద్
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: డిసెంబరు 16
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: జనవరి 6
పరీక్ష తేదీ: 2023 జూన్/జూలై
వెబ్‌సైట్: https://websitenew. tspsc.gov.in/ directRecruitment