Gujarat Results : హార్దిక్ పటేల్ వెనుకంజ

ABN , First Publish Date - 2022-12-08T08:50:49+05:30 IST

గుజరాత్ శాసన సభ ఎన్నికల్లో బీజేపీ సరికొత్త రికార్డు సృష్టించబోతున్నట్లు కనిపిస్తోంది.

Gujarat Results : హార్దిక్ పటేల్ వెనుకంజ
Hardik Patel

గాంధీనగర్ : గుజరాత్ శాసన సభ ఎన్నికల్లో బీజేపీ సరికొత్త రికార్డు సృష్టించబోతున్నట్లు కనిపిస్తోంది. 2002లో ఆ పార్టీ 127 స్థానాలను సాధించగా, ప్రస్తుతం ఆ రాష్ట్రంలోని 182 నియోజకవర్గాల్లో 130 స్థానాల్లో ఆధిక్యంలో కనిపిస్తోంది. అయితే కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన హార్దిక్ పటేల్ వీరంగమ్ స్థానం నుంచి వెనుకంజలో కనిపిస్తున్నారు.

హిమాచల్ ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య విజయం దోబూచులాడుతోంది. ప్రస్తుతం బీజేపీ 36, కాంగ్రెస్ 32 స్థానాల్లో ముందంజలో కనిపిస్తున్నాయి.

గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ 50 స్థానాల్లోనూ, ఆప్ ఒక స్థానంలోనూ ముందంజలో ఉన్నాయి.

Updated Date - 2022-12-08T08:50:53+05:30 IST