Gujarat polls: కాంగ్రెస్‌లో చేరిన బీజేపీ మాజీ మంత్రి

ABN , First Publish Date - 2022-11-28T14:27:39+05:30 IST

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల వేళ పార్టీల్లో చేరికలు కొనసాగుతున్నాయి. ఈనెల మొదట్లో భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసిన..

Gujarat polls: కాంగ్రెస్‌లో చేరిన బీజేపీ మాజీ మంత్రి

అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల వేళ పార్టీల్లో నేతల చేరికలు కొనసాగుతున్నాయి. ఈనెల మొదట్లో భారతీయ జనతా పార్టీకి (BJP) రాజీనామా చేసిన గుజరాత్ మాజీ మంత్రి జయనారాయణ్ వ్యాస్ (Jaynarayan Vyas) కాంగ్రెస్ (Congress) పార్టీలోకి సోమవారంనాడు చేరారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో ఆయన ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. 75 ఏళ్ల వ్యాస్‌కు ఖర్గే, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ పార్టీలోకి ఆహ్వానం పలికారు. గుజరాత్‌లో నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీజేపీ ప్రభుత్వంలో వ్యాస్ మంత్రిగా పనిచేశారు. నవంబర్ 5న ఆయన బీజేపీకి రాజీనామా చేశారు. 182 మంది సభ్యులున్న గుజరాత్ అసెంబ్లీలో డిసెంబర్ 1,5వ తేదీల్లో పోలింగ్ జరుగనుంది. డిసెంబర్ 8న ఫలితాలు వెలువడతాయి.

Updated Date - 2022-11-28T15:46:23+05:30 IST