Munugode Telangana By Election Results 2022: ఐదు రౌండ్లు ముగిసేసరికి టీఆర్‌ఎస్, బీజేపీకి ఓటర్లు ఇచ్చిన షాక్ ఏంటంటే..

ABN , First Publish Date - 2022-11-06T12:40:59+05:30 IST

తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన మునుగోడు ఉప ఎన్నిక ఫలితం (munugode results live) రౌండ్‌రౌండ్‌కూ ఉత్కంఠ రేపుతోంది. టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి (Kusukuntla Prabhakar Reddy), బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) మధ్య...

Munugode Telangana By Election Results 2022: ఐదు రౌండ్లు ముగిసేసరికి టీఆర్‌ఎస్, బీజేపీకి ఓటర్లు ఇచ్చిన షాక్ ఏంటంటే..

తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన మునుగోడు ఉప ఎన్నిక ఫలితం (munugode results live) రౌండ్‌రౌండ్‌కూ ఉత్కంఠ రేపుతోంది. టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి (Kusukuntla Prabhakar Reddy), బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. ఒక రౌండ్‌లో (Munugode Election Results) టీఆర్ఎస్‌ ఆధిక్యంలో ఉంటే, మరో రౌండ్‌లో బీజేపీ ఆధిక్యం కనబరుస్తోంది. కాంగ్రెస్ ఏమాత్రం పోటీ ఇవ్వలేక చతికిలపడిపోయింది. మునుగోడు ఉప ఎన్నిక ఫలితాల (Munugode Election Results Live Today) సరళిని చూస్తే మాత్రం ఒక విషయం స్పష్టమైంది. అధికార టీఆర్‌ఎస్‌కు (TRS) బీజేపీ (BJP) గట్టి పోటీ ఇవ్వడంలో సఫలమైంది. కౌంటింగ్ పూర్తి స్థాయిలో ముగిసేసరికి ఫలితం టీఆర్‌ఎస్, బీజేపీలో ఏ పార్టీకి అనుకూలంగా ఉండనుందోనన్న ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది.

కానీ.. మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలకు (Munugode Results Update) సంబంధించి రెండు పరిణామాలు మాత్రం టీఆర్‌ఎస్, బీజేపీ రెండు పార్టీలనూ కలవరపాటుకు గురిచేశాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది.. తొలి రౌండ్‌‌లో చౌటుప్పల్ మండలంలో పోలైన ఓట్ల గురించి. చౌటుప్పల్ మండలంపై బీజేపీ గంపెడాశలు పెట్టుకుంది. మునుగోడు నియోజకవర్గంలోనే అత్యధిక ఓటర్లు ఉన్న మండలం చౌటుప్పల్. ఈ మండలంలో బీజేపీ భారీగా మెజార్టీ వస్తుందని భావించింది. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా చౌటుప్పల్ మండలంపై బోలెడాశలు పెట్టుకున్నారు. నోటిఫికేషన్‌ నాటికి చౌటుప్పల్‌ మునిసిపాలిటీతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో రాజగోపాల్‌రెడ్డికి ఆదరణ ఉంది.

కాగా అత్యధిక ఓటర్లు ఉన్న ఈ మండలంలో ఆధిపత్యం సాధించేందుకు అధికార టీఆర్‌ఎస్‌ వ్యూహాత్మకంగా ఆది నుంచి పనిచేసింది. మంత్రులు మల్లారెడ్డి, ప్రశాంత్‌రెడ్డితో పాటు ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు, హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యే సైదిరెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌ వంటి ఉద్ధండులకు ఇక్కడ ఎన్నికల బాధ్యత అప్పగించారు. బీజేపీ ఆధిపత్యాన్ని ఎన్నికల నాటికి తగ్గించామని టీఆర్‌ఎస్‌ నేతలు ధీమాగా ఉన్నారు. చివరకు అదే జరిగింది. చౌటుప్పల్ మండలంలో బీజేపీకి మెజార్టీ రాకపోగా.. టీఆర్‌ఎస్ స్వల్ప ఆధిక్యాన్ని కనబర్చింది. 4 రౌండ్లతో చౌటుప్పల్ మండల ఓట్ల లెక్కింపు ముగిసింది. చౌటుప్పల్ మండలంలో మొత్తం పోలైన ఓట్లు 55,678. టీఆర్‌ఎస్‌కు పోలైన ఓట్లు 21,209, బీజేపీ 21,174, కాంగ్రెస్ 5,164. చౌటుప్పల్ మండలంలో బీజేపీని ఆశించిన స్థాయిలో ఓటర్లు ఆదరించలేదని స్పష్టమైంది. కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి ఈ విషయంలో నిరాశ చెందారు. చౌటుప్పల్ మండలంలో కౌంటింగ్ పూర్తయ్యాక ఆయన మాట్లాడుతూ.. చౌటుప్పల్ మండలంలో తాము అనుకున్న మెజార్టీ రాలేదని అంగీకరించారు.

ఇక.. టీఆర్‌ఎస్‌ను కలవరపాటుకు గురిచేసిన అంశం ఏంటంటే.. టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సొంత ఊరిలో ఆయనకు నిరాశ ఎదురైంది. ఆయన సొంత గ్రామమైన కూసుకుంట్ల స్వగ్రామం లింగవారిగూడెంలో బీజేపీ ఆధిక్యం కనబర్చింది. అంతేకాదు.. మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, మల్లారెడ్డి ఇన్‌చార్జ్‌లుగా ఉన్న గ్రామాల్లో కూడా బీజేపీ ఆధిక్యం కనబర్చడం టీఆర్‌ఎస్‌ను విస్మయానికి గురిచేసింది. మొత్తంగా చూసుకుంటే.. ఐదు రౌండ్లు ముగిసేసరికి ఫలితాల సరళిని విశ్లేషిస్తే.. టీఆర్‌ఎస్, బీజేపీ పార్టీ అభ్యర్థుల్లో ఎవరు గెలిచినా స్వల్ప మెజార్టీతో మాత్రమే గట్టెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్‌కు రానున్నది గడ్డు కాలమేననే అభద్రతా భావం కాంగ్రెస్ కార్యకర్తల్లో కలిగేలా హస్తం పార్టీ మునుగోడు ఉప ఎన్నికలో మూడో స్థానానికే పరిమితమయ్యే పరిస్థితి ఉంది.

Updated Date - 2022-11-06T12:41:56+05:30 IST