Munugode by-election: మునుగోడులో కనీస వసతుల కటకట.. పువ్వాడ ఏం చేశారంటే..!

ABN , First Publish Date - 2022-10-26T21:20:14+05:30 IST

మునుగోడు ఉప ఎన్నిక (Munugode by-election) ప్రతిష్ఠాత్మకంగా మారడంతో ప్రధాన పార్టీలు సవాల్‌గా తీసుకున్నాయి. పోలింగ్‌ బూత్‌ స్థాయిలో కీలక నేతలకు బాధ్యతలు అప్పగించారు.

Munugode by-election: మునుగోడులో కనీస వసతుల కటకట.. పువ్వాడ ఏం చేశారంటే..!
Munugode

నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నిక (Munugode by-election) ప్రతిష్ఠాత్మకంగా మారడంతో ప్రధాన పార్టీలు సవాల్‌గా తీసుకున్నాయి. పోలింగ్‌ బూత్‌ స్థాయిలో కీలక నేతలకు బాధ్యతలు అప్పగించారు. ఒక్కసారిగా 30వేల మందికి పైగా నాయకులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి మునుగోడు నియోజకవర్గానికి రావడంతో స్థానికంగా కనీస వసతులు లేకుండా పోయాయి. దీంతో తాము బస చేసుకునేందుకు నాయకులు ఏర్పాటు చేసుకున్నారు. మంత్రి పువ్వాడ అజయ్‌ (ajay) కు మునుగోడు మండలం కొరటికల్‌ ఎంపీటీసీ (mptc) పరిధిని కేటాయించారు. ఆయన ఖమ్మం నుంచి కార్పొరేటర్లు, ఇతర కీలక నేతలతో పెద్ద సంఖ్యలో కొరటికల్‌లో మోహరించారు. కుగ్రామం కావడం స్థానికంగా ఇల్లు కిరాయికి దొరికే పరిస్థితి లేకపోవడంతో వీరంతా ఒక ఫంక్షన్‌ హాలును అద్దెకు తీసుకున్నారు.

గ్రామంలో రెండు ఫంక్షన్‌ హాల్‌లు ఉండగా ఒకటి బీజేపీ నేతలు అద్దెకు తీసుకోగా, మరొకటి టీఆర్‌ఎస్‌ నేతలు తీసుకున్నారు. అందులో 50మందికి రెండు బాత్‌రూంలు మాత్రమే ఉండడంతో ఇబ్బందులతో సర్దుబాటు చేసుకుంటున్నారు. ఈ ఇబ్బందులను గమనించిన మంత్రి అజయ్‌ తన కోసం ప్రత్యేకంగా కేరవాన్‌ బస్సును అద్దెకు తెప్పించుకున్నారు. ఆయన స్థానికంగా బస చేసే రోజు కేరవాన్‌ కొరటికల్‌కు చేరుకుంటుంది. అందులో ఏసీ, వైఫై, విలాసవంతమైన బెడ్‌రూం, బాత్‌రూం సౌకర్యాలు ఉన్నాయి. సినీ రంగానికి చెందిన వారి నుంచి కేరవాన్‌ను మంత్రి అద్దెకు తీసుకున్నట్లు సమాచారం. ఎన్నడూ చూడని వాహనం కళ్లముందు కనిపిస్తుండడంతో స్థానికులు అందులోని విశేషాలపై విస్తృతంగా చర్చించుకుంటున్నారు.

Updated Date - 2022-10-26T21:20:16+05:30 IST