Munugodu by poll: 35 హింసాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించాం

ABN , First Publish Date - 2022-11-02T14:39:00+05:30 IST

మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో 35 హింసాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించామని సీపీ మహేష్ భగవత్ తెలిపారు.

Munugodu by poll: 35 హింసాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించాం

యాదాద్రి భువనగిరి: మునుగోడు ఉప ఎన్నికల (Munugodu by poll) పోలింగ్ నేపథ్యంలో 35 హింసాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించామని సీపీ మహేష్ భగవత్ (Mahesh bhagawat) తెలిపారు. పోలింగ్ నేపథ్యంలో పోలీసులకు సీపీ పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... తొలిసారి ప్రతీ పోలింగ్ కేంద్రంలో కేంద్ర బృందాలతో సంయుక్తంగా రాష్ట్ర పోలీసులతో బందోబస్త్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రతి పోలింగ్ సెంటర్‌లో కనీసం 9 మంది సిబ్బంది ఉంటారన్నారు. ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్‌లు రేపు ఎన్నికలు ముగిసే వరకు ఉంటాయని సీపీ తెలిపారు.

గత ఎన్నికల్లో హింసకు పాల్పడ్డవారిని గుర్తించి బైండ్ ఓవర్ చేశామని చెప్పారు. ఇప్పటి వరకు నాలుగు కోట్ల రూపాయలు నగదుతో పాటు వేయి లీటర్లు పైగా మద్యాన్ని సీజ్ చేశామని... అలాగే 3.5 కిలోల బంగారం, 11.5 కిలోల గంజాయి దొరికాయని అన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో సీసీ కెమెరాల నిఘాలో కొనసాగుతుందన్నారు. అవాంఛనీయ సంఘటనలు జరిగితే ప్రజలు వెంటనే డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని అన్నారు. సుమారు 2000 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్త్ ఏర్పాటు చేశామని సీపీ మహేష్ భగవత్ (Rachkonda CP) తెలిపారు.

Updated Date - 2022-11-02T14:50:10+05:30 IST