Munugodu by poll: వ్యూహాల మార్పులో బీజేపీ... టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలే టార్గెట్
ABN , First Publish Date - 2022-10-22T19:15:11+05:30 IST
మునుగోడు ఉప ఎన్నికల (Munugodu by poll) కోసం టీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి. మునుగోడులో గెలుపు తమదే అన్న ధీమాలో ఇరు పార్టీలు ముందుకెళ్తున్నాయి.
నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నికల (Munugodu by poll) కోసం టీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి. మునుగోడులో గెలుపు తమదే అన్న ధీమాలో ఇరు పార్టీలు ముందుకెళ్తున్నాయి. అయితే తాజాగా పలువురు బీసీ నేతలు, ఉద్యమ నేతలు బీజేపీ (BJP)ని వీడి గులాబీ పార్టీలో చేరారు. దీంతో బీజేపీ మునుగోడులో వ్యూహాలు మార్చుకుంటోంది. ఇద్దరు మునుగోడు బైపోల్స్ స్టీరింగ్ కమిటీ సభ్యులు, స్టీరింగ్ కమిటీలో కీలకంగా ఉన్న స్వామి గౌడ్ (Swamy goud), దోసోజు శ్రవణ్ (Dasoju sravan) పార్టీని వీడిన వారిలో ఉన్నారు. వీరంతా ఉప ఎన్నిక కోసం రచించిన వ్యూహాలు తెలిసిన వ్యక్తులు. బీజేపీ అంటే.. బీసీలకు పెద్దపీఠ వేసే పార్టీగా పేరు తెచుకుంటున్న తరుణంలో కమలం పార్టీకి బీసీ నేతలు గుడ్ బై చెప్పారు. దీంతో అధికార పార్టీకి.. దెబ్బకు దెబ్బ కొట్టాలన్న పట్టుదలతో బీజేపీ ఉంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే టార్గెట్‌గా కమలం పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఆపరేషన్ టీఆర్ఎస్‌కు బీజేపీ ప్లాన్‌ను సిద్ధం చేస్తోంది. ఒకరిద్దరు సెట్టింగ్ ఎమ్మెల్యేలకు కాషాయ కండువా కప్పుతామని కమలనాథులు చెబుతున్నారు. ఈ క్రమంలో గత అర్థరాత్రి మునుగోడులో బీజేపీ కోర్ కమిటీ సమావేశం జరిగింది. దిద్దుబాటు చర్యలను బీజేపీ ప్రారంభించింది. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిపై అనుమానపు చూపులు చూస్తున్నారు.