headache: తలనొప్పిని నయం చేసే 5 సులభమైన మార్గాలు ఇవే..

ABN , First Publish Date - 2022-11-10T13:54:10+05:30 IST

ఈ తలనొప్పులకు మనం చేసే రోజువారి పనులు కూడా కారణం అవుతాయి.

headache: తలనొప్పిని నయం చేసే 5 సులభమైన మార్గాలు ఇవే..
headache

బిజీ లైఫ్ వల్ల అస్తవ్యస్తమైన షెడ్యూల్స్ వల్ల మానసిక ఒత్తిడి పెరిగడం అనేది సాధారణ విషయం. కొన్నిసార్లు ఇది తలనొప్పిగా కూడా మారుతూ తీవ్రమైన బాధ కలిగిస్తూ ఉంటుంది. ఈ తలనొప్పులకు మనం చేసే రోజువారి పనులు కూడా కారణం అవుతాయి. రోజంతా మొబైల్ స్క్రీన్ చూడటం, కంప్యూటర్ ముందు పనిచేయడం, ట్యాబ్స్ గడపటం వంటివి కూడా దీనికి కారణం కావచ్చు. ఆరోగ్యాన్ని బాధించకుండా తలనొప్పి అసౌకర్యం కలగకుండా సులువుగా నయం చేసే 5 సులభమైన మార్గాలు ఇవే..

1. మసాజ్ థెరపీ

మసాజ్‌ మంచి చికిత్సావిధానం, ఎందుకంటే ఇది ఒత్తిడికి గురైన కండరాలకు రిలీఫ్ ని ఇవ్వడంలో సహాయపడుతుంది. కొన్నిసార్లు, ఒత్తిడి, ఉద్రిక్తత తలనొప్పికి కారణం అవుతాయి. నిద్రలేకపోవడం లేదా తీవ్రమైన వ్యాయామం చేయడం వలన కండరాలపై ఒత్తిడి కలుగుతుంది. అలాంటప్పుడు మసాజ్‌లు దీర్ఘకాలిక నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి.

2. ఐస్ ప్యాక్

తలనొప్పికి నుదిటి మీద లేదా నెత్తిమీద, ఐస్ ప్యాక్ తక్షణం నొప్పిని తగ్గించగలదు. ఇది రక్త ప్రవాహంలో తగ్గుదల కారణంగా కావచ్చు. ఐస్ ప్యాక్ అందుబాటులో లేకుంటే, చల్లటి నీటిలో కడిగిన రుమాలును కూడా ఉపయోగించవచ్చు.

3. లావెండర్ నూనె

లావెండర్ ఆయిల్‌ తలనొప్పి లక్షణాల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఇది రిలాక్స్‌గా ఉంచుతుంది. క్యారియర్ ఆయిల్‌తో కరిగించి, నొప్పి ఉన్న ప్రదేశాలకు అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయండి.

4. కొన్ని శ్వాస వ్యాయామాలు ప్రయత్నించండి.

తలనొప్పులు టెన్షన్, ఒత్తిడి కారణంగా వస్తాయి., ఇది నరాలపై మరింత ప్రభావం చూపుతుంది. సాధారణ శ్వాస వ్యాయామాలతో ప్రశాంతంగా ఉంటుంది. శ్వాస వ్యాయామాలు మీ నరాలను, కండరాలను శాంతింపజేస్తాయి.

5. టీ సిప్ చేయండి.

ఒక కప్పు వేడి టీ ఒత్తిడికి గురైన కండరాలకు వెచ్చదనాన్ని తెస్తుంది. రిలీఫ్ ని ఇస్తుంది.

Updated Date - 2022-11-10T14:21:54+05:30 IST