speedy recovery : కిడ్నీ మార్పిడి తర్వాత త్వరగా కోలుకోవాలంటే..!
ABN , First Publish Date - 2022-12-06T11:46:21+05:30 IST
20 శాతం కంటే తక్కువ మందిలో ఏదో అనారోగ్య సమస్య.
శరీరంలో అవయవం మార్పుడి జరిగాకా అది మన శరీరం పనితీరుతో సరిపోవడానికి కాస్త సమయం పడుతుంది. సాంకేతికంగా శరీరంలో కొత్త అవయవాన్ని అమర్చినపుడు, మార్పిడి జరిగినపుడు వెంటనే రిలాక్స్ అయిపోవడం, మామూలు ఆహార అలవాట్లలో పడి అజాగ్రత్తగా ఉండటం అనేది కొత్త సమస్యలను తెచ్చిపెడుతుందని వెద్యులు చెపుతున్న మాట. అవయవ మార్పిడిలో ముఖ్యంగా కిడ్నీ మార్పిడి తరువాత నిర్లష్యం పనికిరాదనేది వైద్యుల హెచ్చరిక. దీనికోసం తీసుకోవలసిన జాగ్రత్తలు తెలుసుకుందాం.
గత కొన్నేళ్ళలో ముఖ్యంగా 10 ఏళ్లలో కిడ్నీ మార్పిడిలో 54 శాతం మంది ప్రజల్లో ఈ మార్పిడితో ఆరోగ్యంగా జీవిస్తున్నా.., 20 శాతం కంటే తక్కువ మందిలో ఏదో అనారోగ్య సమస్యతో మళ్ళీ కిడ్నీ మార్పిడి చేయించుకునే పరిస్థితి వస్తుంది. కిడ్నీ మార్పిడి తర్వాత రోగులు మెడిటరేనియన్ డైట్ పాటిస్తే కిడ్నీ మార్పిడి తర్వాత ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండదని నిపుణులు చెబుతున్నారు.
మూత్రపిండాల మార్పిడి తర్వాత రోగులు ఏవి తినాలి., ఏవి తినకూడదు.
ప్రోటీన్: కిడ్నీ మార్పిడి తర్వాత, శరీరం పూర్తిగా కోలుకోవడానికి ప్రోటీన్ చాలా అవసరం. దీనికి ఆహారంలో గరిష్ట మొత్తంలో ప్రోటీన్లు ఉండేలా చూసుకోవాలి. ఇది కాకుండా, డయాలసిస్ జరిగిన రోగులు ఆహారంలో ప్రోటీన్ స్థాయిని పెంచాలి. వీరు పాలు, పప్పులు వంటి వాటిని ఎక్కువగా తీసుకోవాలి.
పచ్చి పండ్లను తినవద్దు: కిడ్నీ మార్పిడి తర్వాత పండ్లను తినకూడదు, ఎందుకంటే ఇది ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఒక వేళ పండ్లు తినాల్సి వస్తే, పండ్లను వేడి నీళ్లలో వేసి మరిగించి తింటే వాటిలో ఉండే బ్యాక్టీరియాలన్నీ నశిస్తాయి.
పెరుగు: పెరుగులో చాలా మంచి ప్రొటీన్ కంటెంట్ ఉంటుంది కాబట్టి రోగులు కిడ్నీ మార్పిడి తర్వాత పెరుగు తీసుకోవాలి. ఇది కాకుండా, నిమ్మ, చింతపండు వంటి సిట్రస్ పండ్లను తీసుకోవచ్చు. ద్రాక్ష పండ్లను ఈ రోగులు ఎప్పుడూ తినకూడదు.
విత్తనాలతో కూడిన పండ్లు, కూరగాయలు: కిడ్నీ మార్పిడి తర్వాత టమోటా, బెండకాయ, జామ, పుచ్చకాయ వంటి విత్తనాలతో పండ్లు, కూరగాయలు తినడం వల్ల ఎటువంటి హాని లేదు, కానీ అవి శరీరంలోని కొలెస్ట్రాల్, ఎలక్ట్రోలైట్ పరిమాణాన్ని నియంత్రిస్తాయి. కిడ్నీలో రాళ్లతో బాధపడుతుంటే ఈ గింజలతో పండ్లు, కూరగాయలు తినడం మానుకోవాలి.
ప్రోటీన్ సప్లిమెంట్: రోగి మూత్రపిండ మార్పిడి ప్రక్రియలో ఉన్నప్పుడు, ప్రోటీన్ సప్లిమెంట్లను తినమని వైద్యులు సలహా ఇస్తారు. ప్రతి ఒక్కరికీ ఇది అవసరం లేనప్పటికీ, కొన్ని సందర్భాల్లో రోగులు త్వరగా కోలుకుంటారు కాబట్టి వారికి సప్లిమెంట్లు అవసరం లేదు. ప్రోటీన్ సప్లిమెంట్ల్ తీసుకునే ముందు తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి.