లావైతే ఆ ఆసక్తి లోపిస్తుందా? మా సంసార జీవితం సాఫీగా సాగే మార్గం ఉందా?

ABN , First Publish Date - 2022-04-28T17:08:02+05:30 IST

ఈ మధ్య మావారు బరువు పెరిగారు. లైంగిక ఆసక్తి కూడా సన్నగిల్లింది. విషయం ఏంటని ఆరా తీస్తే చూపులకు తనకి తాను నచ్చటం లేదని, లైంగికోద్రేకం పొందటానికి

లావైతే ఆ ఆసక్తి లోపిస్తుందా? మా సంసార జీవితం సాఫీగా సాగే మార్గం ఉందా?

ఆంధ్రజ్యోతి(28-04-2022)

ప్రశ్న: ఈ మధ్య మావారు బరువు పెరిగారు. లైంగిక ఆసక్తి కూడా సన్నగిల్లింది. విషయం ఏంటని ఆరా తీస్తే చూపులకు తనకి తాను నచ్చటం లేదని, లైంగికోద్రేకం పొందటానికి తన శరీరం అడ్డంకిగా మారిందని వాపోతున్నారు. ఈ పరిస్థితి నుంచి ఆయన్ని బయటకు తెచ్చేదెలా? మా సంసార జీవితం సాఫీగా సాగే మార్గం ఉందా?


                       -ఓసోదరి,హైదరాబాద్‌.


డాక్టర్ సమాధానం: మీ వారు ఓ చిత్రమైన చట్రంలో ఇరుక్కున్నారు. ఆకర్షణీయంగా కనిపించలేకపోతున్నాననే బాధకు ఉపశమనాన్ని ఆయన తిండిలో వెతుక్కుంటున్నారు. ఫలితంగా బరువు పెరుగుతున్నారు. దాంతో లైంగికాసక్తి లోపించి ఉద్రేకం పొందలేకపోతున్నారు. అయితే ఈ చట్రం నుంచి ఆయన్ని బయటకు తీసుకొచ్చే వీలుంది. ఇందుకోసం ఆయనతో కలిసి యాక్టివ్‌గా పాల్గొనగలిగే హాబీలను అలవరుచుకోండి. డ్యాన్సింగ్‌, స్విమ్మింగ్‌, టెన్నిస్‌...ఇలా ఏదైనా! ఇలా ఏదో ఓ యాక్టివిటీని దినచర్యలో భాగంగా చేసుకున్న తర్వాత కప్‌బోర్డ్స్‌, ఫ్రిడ్జ్‌ల్లోని తీపి పదార్థాలను ఆరోగ్యకరమైన పదార్థాలతో రీప్లేస్‌ చేయండి. తర్వాత తన బాడీ ఇమేజ్‌ మీద మీ వారికి నమ్మకం పెరిగేలా మాట్లాడటం మొదలుపెట్టండి. నిరుత్సాహంగా కనిపించిన ప్రతిసారీ ఫోన్‌ లేదా మెయిల్స్‌, మెసేజ్‌ల ద్వారా సరదా మాటలతో ఉత్సాహపరచండి. ఇలా చేస్తే తిండిలో కాకుండా మాటల్లో తన ఎమోషన్స్‌ను వ్యక్తం చేయటం నేర్చుకుంటారు. 


ఇక సెక్స్‌ లైఫ్‌ విషయానికొస్తే వీలైనంత ఎక్కువగా ఆయనతో మాట్లాడండి. ఆసరాగా నిలవండి. పూర్తి లైంగిక చర్యలో పాల్గొనకపోయినా మీకు ఆనందాన్నివ్వటానికి ఫోర్‌ ప్లే సరిపోతుందని చెబుతూ ఆయనలో ఆత్మవిశ్వాసాన్ని నింపండి. అలా మాటలతో, ఆరోగ్యకరమైన ఆహారంతో, వ్యాయామంతో ఆయనలో అడుగంటిన లైంగికోద్రేకాన్ని తిరిగి పెంపొందించవచ్చు. అప్పటికీ మీవారు నిరుత్సాహంగానే కనిపిస్తే సెక్సువల్‌ మెడిసిన్‌లో అనుభవమున్న వైద్యుల సలహా తీసుకోండి. తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. 


డాక్టర్‌. షర్మిల మజుందార్‌,

కన్సల్టెంట్‌ సెక్సాలజిస్ట్‌,

mili77@gmail.com

Updated Date - 2022-04-28T17:08:02+05:30 IST