పొట్ట చదునుగా!
ABN , First Publish Date - 2022-09-20T17:45:29+05:30 IST
పొట్ట దగ్గర కొవ్వు కొన్ని ప్రత్యేకమైన వ్యాయామాలను క్రమం తప్పకుండా చేయాలి. అలాంటి వ్యాయామాల్లో చెప్పుకోదగినది ‘బ్యాలెన్సింగ్ ప్లాంక్’! ఇదెలా చేయాలంటే?
పొట్ట దగ్గర కొవ్వు కొన్ని ప్రత్యేకమైన వ్యాయామాలను క్రమం తప్పకుండా చేయాలి. అలాంటి వ్యాయామాల్లో చెప్పుకోదగినది ‘బ్యాలెన్సింగ్ ప్లాంక్’! ఇదెలా చేయాలంటే?
- మోకాళ్లు, అరచేతులు నేల మీద ఆనించి బొమ్మలో చూపించిన భంగిమలో ఉండాలి.
- రెండు అరచేతులు, పాదాలు మాత్రమే నేల మీద ఉండేలా శరీరాన్ని పైకి లేపాలి. ఇది ‘ప్లాంక్’!
- తర్వాత కుడి చేయి, ఎడమ కాలు నేరుగా చాపి 30 అంకెలు లెక్క పెట్టాలి.
- ఈ భంగిమలో ఎడమ చేయి, కుడి కాలు మాత్రమే నేల మీద ఆనించి ఉంచి, వాటి మీదే శరీరం బరువును మోపాలి.
- తర్వాత ఎడమ చేయి, కుడి కాలును కూడా నేరుగా చాపి 30 అంకెలు లెక్కపెట్టి మామూలు స్థితికి రావాలి.
- ఇలా మార్చి మార్చి 5 సెట్లు చేయాలి.