snacks to lose weight : వేగంగా బరువు తగ్గేందుకు 6 ప్రోటీన్ స్నాక్స్ ఇవే..

ABN , First Publish Date - 2022-11-16T15:12:52+05:30 IST

ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకునేవారు చిరుతిండిని పక్కన పెట్టకుండానే బరువు తగ్గడం సాధ్యం అవ్వాలంటే ప్రోటీన్ సహాయం తప్పనిసరి.

snacks to lose weight : వేగంగా బరువు తగ్గేందుకు 6 ప్రోటీన్ స్నాక్స్ ఇవే..
protein snacks

చిరుతిండిని పిల్లలు, పెద్దలు అంతా ఇష్టపడతారు. దీనిని తరచుగా భోజనం చేసిన తరువాత, మధ్యాహ్నం టీతోనూ ఎక్కువగా తీసుకుంటారు. అదే పిల్లలయితే ఆకలేసిన ప్రతిసారీ తినడానికి ఇష్టపడతారు. ఈ చిరుతిండి తినే అలవాటుతో అటు పెద్దలు పిల్లలు కూడా బరువు పెరుగుతారు. అలా అని ఈ అలవాటును మానుకోలేరు. మరి ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకునేవారు చిరుతిండిని పక్కన పెట్టకుండానే బరువు తగ్గడం సాధ్యం అవ్వాలంటే ప్రోటీన్ సహాయం తప్పనిసరి. అదెలాగో చూద్దాం.

గ్రీకు పెరుగు

గ్రీక్ పెరుగు ప్రోటీన్, కాల్షియం కలగలిసిన మంచి ఆహారం. ఇది ఆరోగ్యకరమైనది. తిన్న తరువాత కడుపుని నిండుగా ఉంచుతుంది, అతిగా తినడాన్ని తగ్గిస్తుంది. గ్రీక్ పెరుగు బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

బాదం

బాదంపప్పులో ప్రొటీన్లు, విటమిన్ ఇ, రైబోఫ్లావిన్, ట్రేస్ మినరల్స్ , మంచి కొవ్వులు అధికంగా ఉంటాయి. బాదం నానబెట్టడం వల్ల జీవక్రియను పెంచే, బరువు తగ్గడానికి సహాయపడే లైపేస్ వంటి ఎంజైమ్‌లు విడుదలవుతాయి.

ప్రోటీన్ బార్

ప్రోటీన్ బార్ ప్రోటీన్ బార్ తినడం బరువు తగ్గించే చిరుతిండి. 15-20గ్రా ప్రొటీన్‌తో పాటు ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్పరస్, బి విటమిన్‌లను అందిస్తాయి. ప్రోటీన్ బార్‌లు కడుపు నిండుగా ఉండటానికి, కండరాలు పెరిగేందుకు, కొవ్వును తగ్గించడానికి, బరువు తగ్గడానికి మీకు సహాయపడతాయి.

గుడ్లు

ఉడకబెట్టిన గుడ్లు స్నాక్స్‌లో తీసుకుంటే బరువు తగ్గడానికి మంచి పోషకాలు అందిస్తాయి.

పిస్తాపప్పులు

పిస్తాలు శరీరానికి ప్రోటీన్, ఫైబర్ , ఆరోగ్యకరమైన కొవ్వులను అందిస్తాయి. పిస్తాపప్పులు తినడం బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

గ్రానోలా

గ్రానోలాలో రోల్డ్ వోట్స్, బాదం, తేనె ఉంటాయి. ప్రొటీన్లు అధికంగా ఉంటాయి.ఇవి ఔన్స్‌కు 4 గ్రాముల ప్రోటీన్‌ను అందిస్తాయి. ఆరోగ్యకరమైన, స్థిరమైన బరువు తగ్గడంలో ప్రోటీన్-రిచ్ స్నాక్స్ ఎంచుకోవడం వల్ల త్వరగా బరువు తగ్గడానికి ఈ ప్రోటీన్ స్నాక్స్‌ సపోర్ట్ చేస్తాయి. ఆరోగ్యంగా కూడా ఉంచుతాయి.

Updated Date - 2022-11-16T15:14:36+05:30 IST