hair: ఈ ఆహారం జుట్టుకు మంచిది!
ABN , First Publish Date - 2022-12-28T11:07:27+05:30 IST
ప్రొటీన్లు, విటమిన్లు అధికంగా ఉండే ఆహారం తింటే జుట్టు(hair) కుదుళ్లు గట్టిగా అవుతాయి. జుట్టు రాలడం లాంటి సమస్యలు
ప్రొటీన్లు, విటమిన్లు అధికంగా ఉండే ఆహారం తింటే జుట్టు(hair) కుదుళ్లు గట్టిగా అవుతాయి. జుట్టు రాలడం లాంటి సమస్యలు ఉండవు. పాలకూరతో చేసిన ఆహారాన్ని తినటం వల్ల విటమిన్ ఎ, కె లభిస్తాయి. జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది.
పప్పుధాన్యాలు తినటం వల్ల కూడా వీటిలో ప్రొటీన్లు, ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. ముఖ్యంగా ప్రొటీన్ల వల్ల కుదుళ్లకు ఆక్సిజన్ చేరటం వల్ల జుట్టు పెరుగుదల బావుంటుంది.
కోడిగుడ్లు(eggs), చేపలు(Fish) తినటం వల్ల కూడా జుట్టు సమస్యలకు చెక్ పెట్టొచ్చు.
బాదం, పిస్తా లాంటి గింజల్లోని ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు.. దీంతో పాటు సిట్రస్ ఆమ్లం ఉండే నిమ్మకాయలు, నారింజ పండ్లు తీసుకోవటం వల్ల కూడా జుట్టుకు మంచిది.