effective for diabetics: మధుమేహ వ్యాధిగ్రస్తులు ఏ సమయంలో వ్యాయామం చేయడం మంచిది..?

ABN , First Publish Date - 2022-11-13T09:12:22+05:30 IST

రోజంతా నడవడం భోజనం తర్వాత ఐదు నిమిషాల వ్యాయామం చక్కెర స్థాయిలను తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి

effective for diabetics: మధుమేహ వ్యాధిగ్రస్తులు ఏ సమయంలో వ్యాయామం చేయడం మంచిది..?
diabetics

మధుమేహ వ్యాధిగ్రస్తులు మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో చేసే వ్యాయామం ఆరోగ్యాన్ని ప్రభావితం చేసి మంచి ఫలితాలను అందిస్తుందనేది అధ్యయనాలు చెపుతున్న మాట. ఉదయం వ్యాయామం చేసే వారితో పోల్చి చూస్తే మధ్యాహ్న సమయాల్లో (మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 6 గంటల వరకు) మితమైన శారీరక శ్రమ చేసేవారిలో ఇన్సులిన్ నిరోధకత 18 శాతం వరకూ తగ్గింది. సాయంత్రం (సాయంత్రం 6 నుంచి అర్థరాత్రి12 గంటల వరకు) వ్యాయామం చేసేవారిలో ఇది తగ్గిందని తెలిపింది.

రోజంతా నడవడం భోజనం తర్వాత ఐదు నిమిషాల వ్యాయామం చక్కెర స్థాయిలను తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా గుండె జబ్బులు ఉన్న రోగులకు ఇది చేయడం అంత శ్రేయస్కరం కాదు. మధుమేహంతో బాధపడేవారు మాత్రమే ఈ నియమాన్ని పాటించి వ్యాయామం చేయడం మంచిది.

భోజనం తర్వాత నడక మంచిదే. ఇక ఉదయం 40 నుంచి 45 నిమిషాల కఠినమైన వ్యాయామాన్ని చేయడం ముఖ్యం. ఐదు నుంచి పది నిమిషాల వ్యాయామం, చక్కెర నియంత్రణకు మంచిది. వీటితో పాటు సాంప్రదాయ యోగాసనాలు, సూర్య నమస్కారాలు ను చేయడం కూడా ఆరోగ్యానికి సహకరిస్తాయి.

Updated Date - 2022-11-13T09:12:30+05:30 IST