థైరాయిడ్ గ్రంథి భేషుగ్గా పని చేయాలంటే..?
ABN , First Publish Date - 2022-04-12T16:01:11+05:30 IST
శరీర జీవక్రియలన్నీ సక్రమంగా జరగాలంటే థైరాయిడ్ గ్రంథి భేషుగ్గా పని చేయాలి. అయితే పర్యావరణం, ఆహార, జీవనశైలి సమస్యల మూలంగా థైరాయిడ్ గ్రంథి
ఆంధ్రజ్యోతి(12-04-2022)
శరీర జీవక్రియలన్నీ సక్రమంగా జరగాలంటే థైరాయిడ్ గ్రంథి భేషుగ్గా పని చేయాలి. అయితే పర్యావరణం, ఆహార, జీవనశైలి సమస్యల మూలంగా థైరాయిడ్ గ్రంథి పూర్తి సామర్థ్యంతో పని చేయలేకపోతోంది. ఇలా మొండికేస్తున్న గ్రంథిని ఈ యోగాసనాలతో తిరిగి పని చేయించేలా చేయవచ్చు.
హలాసనం: వెల్లకిలా పడుకోవాలి. కాళ్లనూ, చేతులనూ శరీరానికి దగ్గరగా ఉంచాలి. రెండు కాళ్లూ పైకి లేపి, తల వెనక నేల మీద ఆనించాలి. ఈ భంగిమలో ఉండగలిగినంత సేపు ఉన్న తర్వాత, తిరిగి కాళ్లను పైకి లేపి, తల మీదుగా యధాస్థానానికి తీసుకురావాలి. కాళ్లను పైకి లేపేటప్పుడు, పొట్ట, నడుము ఆసరాగా తీసుకోవాలి.
మత్స్యాసనం: పద్మాసనంలో కూర్చుని, నెమ్మదిగా వెనక్కి వంగి, తలను నేలకు ఆనించాలి. ఈ భంగిమలో వీపు విల్లులా వంగి ఉండాలి. వెనక్కి వంగేటప్పుడు మోచేతులను నేల మీద ఆనించి ఉంచి, వాటి ఆసరాతో వంగవచ్చు. తల నేలకు తాకించిన తర్వాత చేతులతో కాలి బొటనవేళ్లు పట్టుకోవాలి. ఈ భంగిమలో కూడా ఉండగలిగినంత సేపు ఉండి, తిరిగి తలను నెమ్మదిగా పైకి లేపి, పూర్వపు స్థితికి చేరుకోవాలి.