ఫిట్‌గా ఉండాలంటే...

ABN , First Publish Date - 2022-02-15T20:47:44+05:30 IST

ఉరుకుల పరుగుల జీవితంలో శరీరానికి కొంత విశ్రాంతి కావాలి. ఇందుకోసం యోగాను ఆశ్రయించడం తప్పనిసరి. క్రమం తప్పకుండా యోగాసనాలు వేస్తే.. శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా బలపడతారు.

ఫిట్‌గా ఉండాలంటే...

ఆంధ్రజ్యోతి(15-02-2022)

ఉరుకుల పరుగుల జీవితంలో శరీరానికి కొంత విశ్రాంతి కావాలి. ఇందుకోసం యోగాను ఆశ్రయించడం తప్పనిసరి. క్రమం తప్పకుండా యోగాసనాలు వేస్తే.. శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా బలపడతారు. 


తాడాసనం 

రెండు పాదాలు ఎదురుగా చూస్తున్నట్లు, మోకాళ్లు సమాంతరంగా ఉంచి నిటారుగా నిలబడాలి.

గాలి పీల్చుకుని తొడల పైభాగం వెనక్కి నెట్టాలి.

ఇలా చేసినప్పుడు పిరుదులను వెనక్కి నెట్టినట్లు అనిపించాలి. 

ఛాతిని విస్తరించి పొట్టను, పొట్టను లోపలికి పీల్చుకోవాలి.


ప్రయోజనం: పొత్తి కడుపు కండరాలు ధృడమవుతాయి. తొడలు, మోకాళ్లు, పిక్కలు, మడమలు బలపడతాయి. 


త్రికోణాసనం 

తాడాసనంలో నిలబడి రెండు కాళ్లను దూరంగా పెట్టాలి.

రెండు చేతులు పక్కకు చాపి ఉంచాలి. ఎడమ పాదాన్ని కొద్దిగా లోపలికి తిప్పి, కుడి పాదాన్ని బయటకు తిప్పాలి. 

గాలి వదులుతూ కుడిపాదం వైపు వంగి చేతితో మోకాలి కింద పట్టుకోవాలి. 

ఇలా వంగినప్పుడు ఎడమచేయి గాల్లోకి లేపాలి.తలను ఆకాశం వైపు తిప్పి ఉంచి, చూపును పైకే నిలిపి ఉంచాలి. 

ఈ భంగిమలో పది సెకండ్లు ఉండి తిరిగి రెండో వైపు కూడా చేయాలి.


ప్రయోజనం: జీర్ణశక్తి పెరుగుతుంది. రుతుక్రమం సమస్యలు తొలగిపోతాయి. 

సయాటికా నొప్పి తగ్గుతుంది. కండరాల బిగుతు సడలుతుంది.



మారిచ్యాసనం 

కాళ్లను ఎడంగా ఉంచి కూర్చోవాలి.

కూర్చున్నప్పుడు ఒక పాదం అడుగుభాగం రెండవ తొడను తాకాలి. రెండవ పాదం శరీరానికి దూరంగా ఉండాలి. 

అరచేతులను వెల్లకిలా తొడల మీద ఉంచాలి. చేతి బొటనవేళ్లు, చూపుడు వేళ్లను కలపాలి.

ఈ భంగిమలో వీలైనంత ఎక్కువ సమయం కూర్చోవాలి. 


ప్రయోజనం: రక్తప్రసరణ పెరిగి, నాడీవ్యవస్థ పనితీరు మెరుగవుతుంది. ఊపిరి పీల్చి వదులుతూ ఉండటం వల్ల పొట్టలోని అంతర్గత అవయవాల పనితీరు మెరుగవుతుంది.

Updated Date - 2022-02-15T20:47:44+05:30 IST