Cigarette Ban: 2009 తరువాత పుట్టినోళ్లకు సిగరెట్ అమ్మకాలపై నిషేధం..!
ABN , First Publish Date - 2022-12-13T20:14:14+05:30 IST
ప్రజలను ధూమపాన వ్యసనానికి దూరం చేసేందుకు న్యూజీల్యాండ్ ప్రభుత్వం ఓ సరికొత్త ప్లాన్‌కు తెరతీసింది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రజలను ధూమపాన వ్యసనానికి(Smoking) దూరం చేసేందుకు న్యూజీల్యాండ్(NewZealand) ప్రభుత్వం ఓ సరికొత్త ప్లాన్‌కు తెరతీసింది. దేశంలో 2009, ఆ తరువాత పుట్టిన వారికి పొగాకు ఉత్పత్తుల అమ్మకాలను నిషేధిస్తూ(Ban on Cigarette Sales) ఓ ముసాయిదా బిల్లును సిద్ధం చేసింది. ఈ నిషేధంతో.. భవిష్యత్ తరాలకు సిగరెట్లు అందక ప్రజలు క్రమంగా ధూమపానానికి దూరమైపోతారని అంచనా వేస్తోంది. 2025 నాటికల్లో దేశంలోని సిగరెట్ షాపుల్లో 95 శాతం మూసేయాలన్న ప్రతిపాదనను కూడా ఈ బిల్లులో ప్రభుత్వం చేర్చింది. వీటికి తోడు.. సిగరెట్లలో నికోటిన్ శాతాన్ని తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రతిపాదనలకు అక్కడి పార్లమెంట్ ఆమోదం లభిస్తే.. ధూమపాన రహితంగా(Smoke Free) మారిన తొలి దేశంగా న్యూజీల్యాండ్ రికార్డు సృష్టించొచ్చు. అయితే.. పరిశీలకులు మాత్రం ఈ వ్యూహం ప్రతికూల ఫలితాలు ఇవ్వొచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిషేధంతో బ్లాక్ మార్కెట్‌లో పొగాకు ఉత్పత్తుల అమ్మకాలు పెరిగిపోతాయని హెచ్చరిస్తున్నారు.