Jinping VS Shehbaz: చైనాలో తొలిసారి పర్యటించనున్న పాక్ ప్రధాని

ABN , First Publish Date - 2022-10-26T18:19:42+05:30 IST

ఇస్లామాబాద్: చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ‌ను కలుసుకునేందుకు పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాబ్ షరీఫ్ వచ్చేవారంలో చైనాలో పర్యటించనున్నారు. 2022 ఏప్రిల్‌లో పాక్ ప్రధానమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత చైనాలో షెహబాజ్ పర్యటించనుండటం ఇదే ప్రథమం. చైనాలో రెండ్రోజుల పాటు షెహబాజ్ పర్యటించనున్నట్టు పాక్ విదేశాంగ మంత్రి బుధవారంనాడు ఒక ప్రకటనలో తెలిపింది.

Jinping VS Shehbaz:  చైనాలో తొలిసారి పర్యటించనున్న పాక్ ప్రధాని

ఇస్లామాబాద్: చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ (Xi Jinping)ను కలుసుకునేందుకు పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాబ్ షరీఫ్ (Shehbaz Sharif) వచ్చేవారంలో చైనాలో పర్యటించనున్నారు. 2022 ఏప్రిల్‌లో పాక్ ప్రధానమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత చైనాలో షెహబాజ్ పర్యటించనుండటం ఇదే ప్రథమం. చైనాలో రెండ్రోజుల పాటు షెహబాజ్ పర్యటించనున్నట్టు పాక్ విదేశాంగ మంత్రి బుధవారంనాడు ఒక ప్రకటనలో తెలిపింది. ఇటీవలే చైనా నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ ది కమ్యూనిస్ట్ పార్టీ 20వ సమావేశం ముగియడం, ఈ సమావేశంలో మరో ఐదేళ్లపాటు జిన్‌పింగ్‌కే అధికారం కట్టబెట్టడం వంటి పరిణామాల తర్వాత చైనాలో పర్యటించనున్న తొలి నాయకుడు షెహనాజ్ కానుండటం విశేషం.

జిన్‌పింగ్, షెహబాజ్ సమావేశంలో ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక సహకారం కొనసాంగిచడం, ప్రాంతీయ, ప్రపంచ పరిణామలపై పరస్పరం అభిప్రాయాలను పంచుకోవడం వంటి అంశాలు చర్చకు రానున్నాయి. పాకిస్థాన్ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఉండటం, రుణాలు, వాణిజ్య లోటును భర్తీ చేసుకునేందుకు లక్షల డాలర్లు చెల్లింపులతో అల్లాడుతున్న తరుణంలో షెహనాజ్ చైనాలో పర్యటించనున్నారు. నవంబర్ 1,2 తేదీల్లో పర్యటించనున్న షెహబాజ్ వెంట ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి బిలావల్ భుట్టో జర్దారి, ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఉంటుంది. చైనా అధ్యక్షుడి ఆహ్వానం మేరకు షెహనాజ్ ఆదేశంలో పర్యటించున్నట్టు పాక్ విదేశాంగ శాఖ ఆ ప్రకటనలో పేర్కొంది.

Updated Date - 2022-10-26T18:21:23+05:30 IST