Lake Victoria: సరస్సులో కూలిన ప్రయాణికుల విమానం

ABN , First Publish Date - 2022-11-06T15:52:21+05:30 IST

ఓ ప్రయాణికుల విమానం విక్టోరియా సరస్సు(Lake Victoria)లో కూలిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో

Lake Victoria: సరస్సులో కూలిన ప్రయాణికుల విమానం

డొడోమా: టాంజానియా(Tanzania)లో ఆదివారం ఓ ప్రయాణికుల విమానం విక్టోరియా సరస్సు(Lake Victoria)లో కూలిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆఫ్రికాలోనే అతిపెద్ద సరస్సు అయిన లేక్ విక్టోరియాలో విమానం దాదాపుగా మునిగిపోయినట్టు వైరల్ అయిన వీడిల్లో కనిపిస్తోంది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 23 మందిని రక్షించారు. ఎంవాంజా నుంచి బుకోబాకు 49 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తుండగా విమానం సరస్సులో కూలిపోయింది.

23 మందిని రక్షించిన సహాయక బృందాలను మిగిలిని వారిని రక్షించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. కూలిపోయిన విమానం టాంజానియాలోని అతిపెద్ద ప్రైవేట్ ఎయిర్‌లైన్ సంస్థ అయిన ప్రెసిషన్ ఎయిర్‌కు సంబంధించిన పీడబ్ల్యూ 494(PW 494) విమానంగా గుర్తించారు. విమానం మరికాసేపట్లో బుకోబా విమానాశ్రయంలో ల్యాండవుతుందనగా ప్రమాదం సంభవించింది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Updated Date - 2022-11-06T15:55:47+05:30 IST