Donald Trump:అమెరికాలో ట్రంప్ కంపెనీలు పన్ను చెల్లింపుల్లో మోసం
ABN , First Publish Date - 2022-12-07T07:06:09+05:30 IST
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌నకు చెందిన వ్యాపార సంస్థలు పన్ను చెల్లింపుల్లో మోసానికి పాల్పడ్డాయని....
న్యూయార్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌నకు చెందిన వ్యాపార సంస్థలు పన్ను చెల్లింపుల్లో మోసానికి పాల్పడ్డాయని న్యూయార్క్ జ్యూరీ నిర్ధారించింది.(Donald Trump) మాన్‌హట్టన్ నగరంలో నిర్మించిన అపార్ట్‌మెంట్లు,కొన్న విలాసవంతమైన కార్లపై పన్నులను తప్పించుకోవడానికి మోసాలు చేశారని కోర్టు తేల్చింది.(Tax Fraud) ట్రంప్ కు చెందిన రెండు కార్పొరేట్ సంస్థలు (Trump Organisation)తప్పుడు రికార్డులతో మోసం చేశాయని జ్యూరీ(New York Jury) పేర్కొంది. ట్రంప్ వ్యాపారాలపై మూడేళ్లపాటు దర్యాప్తు చేశారు. ట్రంప్ సంస్థలు చేసిన మోసాలపై కోర్టు 1.6 మిలియన్ డాలర్ల జరిమానా విధించింది. తాను మళ్లీ అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత, రాజకీయ ప్రేరేపితంగా కేసు పెట్టారని ట్రంప్ సంస్థల లాయర్ అలాన్ ఫుటర్ ఫాస్ ఆరోపించారు. ఈ కేసులో అప్పీలు చేస్తానని ఫుటర్ ఫాస్ ప్రకటించారు.