14 kg gold: ఉడుపి మంజేశ్వర ఆలయానికి 14 కిలోల బంగారు పల్లకి

ABN , First Publish Date - 2022-11-03T12:41:38+05:30 IST

ఉడుపిలోని చారిత్రాత్మక మంజేశ్వర శ్రీమద్‌ అనంతేశ్వర ఆలయానికి భక్తులు సమర్పించిన విరాళాలు, బంగారంతో 14 కేజీల పల్లకి(14 kg palanquin)ని తయారు చేశారు.

14 kg gold: ఉడుపి మంజేశ్వర ఆలయానికి 14 కిలోల బంగారు పల్లకి

బెంగళూరు, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): ఉడుపిలోని చారిత్రాత్మక మంజేశ్వర శ్రీమద్‌ అనంతేశ్వర ఆలయానికి భక్తులు సమర్పించిన విరాళాలు, బంగారంతో 14 కేజీల పల్లకి(14 kg palanquin)ని తయారు చేశారు. మంగళవారం ఆధ్యాత్మిక విధి విధానాలు పూర్తి చేసి ఆలయ ట్రస్టుకు బంగారు పల్లకిని అప్పగించారు. అర్చకులు శ్రీకాంత్‌ అవధాని, పురుషోత్తమ ఆచార్య బంగారు పల్లకికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ చైర్మన్‌ కోటేశ్వర్‌ దినేశ్‌ జీ కామత్‌, ట్రస్టు సభ్యులు ఛత్రపతి శివాజి ప్రభు, యోగేశ్‌ ఆర్‌ కామత్‌, కృష్ణభట్‌, రాఘవేంద్ర ప్రభు, అజిత్‌కుమార్‌ షెణైలతోపాటు 18మంది సభ్యులు, పదాధికారులు పాల్గొన్నారు. ఆభరణ జ్యువెల్స్‌ వర్స్‌షాప్‌లో పల్లకిని సిద్ధం చేశారు. ఆభరణ జ్యువెల్స్‌ డైరెక్టర్‌ మధుకర్‌ ఎస్‌ కామత్‌తోపాటు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఉడుపి నుంచి మంజేశ్వరనగర్‌ దాకా ఓపెన్‌ టాప్‌ వాహనంలో బయల్దేరిన బంగారు పల్లకి ఉడుపి, దక్షిణకన్నడ జిల్లాలోని ప్రముఖ ఆలయాలకు వెళ్లి గురువారం మంజేశ్వర ఆలయానికి చేరుకోనుంది. 6న ఆలయంలో కాశీమఠాధిపతి సంయమీంద్ర తీర్థ సమక్షంలో పూజలు ప్రారంభించనున్నారు. వజ్రాలు, మాణి క్యాలు, నవరత్నాలతో బంగారు పల్లకిని 40 రోజులపాటు ఐదుగురు నిపుణులు రూపొందించారు.

Updated Date - 2022-11-03T12:41:41+05:30 IST