కోస్ట్‌గార్డ్‌కు తేలికపాటి హెలికాప్టర్ స్క్వాడ్రన్
ABN , First Publish Date - 2022-12-02T04:14:29+05:30 IST
భారత తీర ప్రాంత గస్తీదళం పెట్రోలింగ్‌కు ఉపయోగపడేలా తేలికపాటి ఆధునిక హెలికాప్టర్‌ను అందుబాటులోకి తెచ్చారు. కోస్ట్‌గార్డ్ డైరెక్టర్ జనరల్ వీఎస్ పథానియా చెన్నైలో..
చెన్నైలో ప్రారంభించిన కోస్ట్‌గార్డ్ డైరెక్టర్ జనరల్
ఆధునిక హంగులతో హెచ్‌ఏఎల్ తయారీ
సముద్ర జలాల్లో నిఘా కోసం వినియోగం
చెన్నై, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): భారత తీర ప్రాంత గస్తీదళం పెట్రోలింగ్‌కు ఉపయోగపడేలా తేలికపాటి ఆధునిక హెలికాప్టర్‌ను అందుబాటులోకి తెచ్చారు. కోస్ట్‌గార్డ్ డైరెక్టర్ జనరల్ వీఎస్ పథానియా చెన్నైలో లాంఛనంగా ప్రారంభించారు. కోస్ట్‌గార్డ్‌కు 16 ఏఎల్‌హెచ్ ఎంకే-3 హెలికాప్టర్లు అందజేశారు. వాటిలో నాలుగు చెన్నై నుంచి పని చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. వీటిని హిందుస్థాన్ ఏరోనాటికల్ సంస్థ తయారు చేసింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల తీర ప్రాంతాలకు సుదూరంగా ఉన్న సముద్ర సరిహద్దు జలాల్లో కోస్ట్‌గార్డ్ సామర్థ్యాన్ని మరింత మెరుగుపరుస్తాయి. అధునాతన రాడార్, ఎలకో్ట్ర ఆప్టికల్ సెన్సార్‌లు, శక్తిమంతమైన ఇంజన్, ఫుల్‌గ్లాస్ కాక్‌పిట్, హైఇంటెన్సిటీ సెర్చ్‌లైట్‌తో అప్‌గ్రేడ్ చేశారు. కమ్యూనికేషన్ పరికరాలు, ఆటోమేటిక్ ఇండెంటిఫికేషన్ సిస్టమ్, సెర్చ్ అండ్ రెస్క్యూ హోమర్ వంటి అత్యాధునిక పరికరాలను కలిగి ఉన్నాయి. సముద్ర నిఘా కోసం వీటిని ఉపయోగించనున్నారు. ఓడల నుంచి దీర్ఘశ్రేణి శోధన, రెస్క్యూ కార్యకలాపాలను కూడా సులభతరం చేస్తాయి. పగలు, రాత్రి వేళల్లో కూడా పని చేస్తాయి.