Adipurush: సంక్రాంతికి కాదట.. విడుదల ఎప్పుడంటే?

ABN , First Publish Date - 2022-10-31T13:47:31+05:30 IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆదిపురుష్’ (Adipurush). రామాయణ ఇతిహాస నేపథ్యంతో దర్శకుడు ఓంరౌత్ (Om Raut) ఈ చిత్రాన్ని..

Adipurush: సంక్రాంతికి కాదట.. విడుదల ఎప్పుడంటే?
Prabhas in Adipurush

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆదిపురుష్’ (Adipurush). రామాయణ ఇతిహాస నేపథ్యంతో దర్శకుడు ఓంరౌత్ (Om Raut) ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కృతి సనన్ (Kriti Sanon) నాయికగా నటిస్తోంది. సైఫ్ అలీఖాన్, సన్నీ సింగ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. అత్యున్నత సాంకేతిక విలువలతో భారీ బడ్జెట్ తో టీ సిరీస్, రెట్రో ఫైల్స్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. చిత్ర నిర్మాణంలో యూవీ క్రియేషన్స్ (UV Creations) నుంచి వంశీ, ప్రమోద్ భాగస్వామ్యులుగా వ్యవహరిస్తున్నారు. మోస్ట్ అవేటింగ్ మూవీగా దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి పర్వదినం సందర్భంగా జనవరి 12న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. సంక్రాంతి బరి నుండి ఈ సినిమా తప్పుకున్నట్లుగా తెలుస్తోంది. దీనికి కారణం విఎఫ్‌ఎక్స్ అని అంటున్నారు. (Rumors on Adipurush Release)

విఎఫ్ఎక్స్ వర్క్ ఇంకా పెండింగ్ ఉన్న కారణంగా.. సినిమాని వచ్చే సంవత్సరం మే నెలలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లుగా టాక్ నడుస్తోంది. కానీ చిత్రయూనిట్ నుంచి మాత్రం.. ఈ సినిమా వాయిదా విషయమై ఎటువంటి అప్‌డేట్ రాలేదు. అయితే.. ఈ సినిమా వాయిదాకు సంబంధించి ఇండస్ట్రీ వర్గాల్లో మరో వార్త కూడా హల్‌చల్ చేస్తోంది. సంక్రాంతికి నాలుగైదు సినిమాల మధ్య ఈ సినిమాను విడుదల చేయడం ఇష్టంలేకే.. సోలో రిలీజ్‌ కోసం వాయిదా వేస్తున్నట్లుగా టాక్ నడుస్తోంది. మరి ఈ వార్తలో ఎంత నిజముందో కూడా చిత్రయూనిట్‌కే తెలియాలి. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని చాలా కాలం అవుతుంది. రీసెంట్‌గా టీజర్ విడుదల సమయంలో కూడా దర్శకుడు.. ఈ సినిమాను సంక్రాంతికి ఖచ్చితంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని మాటిచ్చారు. మరి సడెన్‌గా ఈ వార్తలేంటో వారికే తెలియాలి. ఈ వార్తలపై చిత్రయూనిట్ ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం. (Adipurush postponed)

Updated Date - 2022-10-31T13:56:47+05:30 IST