Home » Sankranthi
కుటుంబ కార్డులకు జనవరి మొదటి వారం నుంచి రేషన్ దుకాణాల ద్వారా పొంగల్(Pongal) గిఫ్ట్తో చీర, ధోవతి పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర మంత్రి గాంధీ(Minister Gandhi) పేర్కొన్నారు. ఈ అంశంపై ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు.
సంక్రాంతి(Sankranti)కి సుమారు నాలుగునెలల ముందే ఏపీకి వెళ్లే రైళ్లల్లో బెర్త్లన్నీ నిండిపోయాయి. రిజర్వేషన్ బుకింగ్ ఓపెన్ చేసిన కొద్ది గంటల్లోనే బెర్త్లు అయిపోయాయి. అప్పుడే వెయిటింగ్ లిస్ట్ భారీగా కనిపిస్తోంది. ప్రత్యేకించి నగరంలో స్థిర నివాసం ఏర్పరచుకున్న ఏపీ వాసులైతే కుటుంబాలతో సహా తమ ఊర్లకు వెళ్లేందుకు నాలుగు నెలల ముందు నుంచే ప్లాన్ చేసుకుంటున్నారు.
అమెరికాలో(America) సంక్రాంతి వేడుకలను(Sankranthi Celebrations) అక్కడి తెలుగు ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. కెనడా, నోవా స్కోటియా, హాలిఫాక్స్, డార్ట్ మౌత్, బెడ్ ఫోర్డ్ తదితర ప్రాంతాల్లో ఎన్ఆర్ఐ(NRIs)లు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హిందూ సంస్కృతి సంప్రదాయం ఉట్టిపడేలా ముగ్గులు, గాలిపటాలు, పూల తోరణాలతో ఆయా ప్రాంతాలు రంగులమయం అయ్యాయి.
గలగల ప్రవహించే గోదావరి తీర గ్రామాలు కావచ్చు.. ఇసుక దిబ్బల ఎడారి పెట్రో నగరాలు కావచ్చు.. ఎక్కడైనా పండుగ
భోగితో మొదలై సంక్రాంతితో సందడిగా మారుతుంది. మూడో రోజు కనుమతో సంక్రాంతి సంబరాలు ముగుస్తాయి. ప్రాంతాన్ని బట్టి కనుమకు ప్రత్యేకత ఉంది. ఆంధ్రప్రదేశ్లో కనుమ రోజున నోరూరించే నాన్ వెజ్ వంటకాలు చేసుకుంటారు.
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ జరుపుకోవడానికి ప్రజలు సిద్ధమవుతుండగా.. ఏపీలో రాజకీయ నాయకులు పండగను అందివచ్చిన అవకాశంగా భావిస్తున్నారు. ఎందుకనుకుంటున్నారా....
కోడి పందాలే కాదు గుండాట వల్ల కూడా డబ్బులు పోగొట్టుకుంటారు. కొంచెం డబ్బు వస్తే చాలు మరికొంత కావాలని ఆశతో ఉంటారు. ఒకవేళ డబ్బులు పోతే తిరిగి తెచ్చుకోవాలని ఆడతారు. పోయిన మనీ కోసం ఆడుతుంటే తిరిగి రావు. దీంతో జేబులు ఖాళీ అవుతుంటాయి.
హైదరాబాద్లో ఆదివారం తెల్లవారుజామునుంచే వీధివీధినా.. ఇళ్లు, అపార్ట్మెంట్ల ముందు పెద్ద ఎత్తున భోగిమంటలు వేసి పిన్నాపెద్దా అందరూ కలిసి అక్కడ గుమిగూడి సరదాగా ముచ్చట్లు చెప్పుకోవడం కనిపించింది. అలాగే రాత్రుళ్లు మహిళలంతా కలిసి కబుర్లు చెప్పుకొంటూ.. వీధి గుమ్మాల్లో అందమైన రంగవల్లులను ఆవిష్కరిస్తున్నారు. ఆనవాయితీ ఉన్నవారు బొమ్మల కొలువులు తీర్చిదిద్దుతున్నారు. పిల్లలేమో అపార్ట్మెంట్లు, ఇళ్ల మేడలపైకెక్కి పతంగులు ఎగరేస్తూ రచ్చరచ్చ చేస్తున్నారు. మొత్తమ్మీద.. పండుగ ఉత్సాహం ఎల్లెడలా తొణికిసలాడుతోంది.
పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం కస్పా పెంటపాడు కోడి పందాల బరిలో ఘర్షణ జరిగింది. ఒకరిపై ఒకరు పరస్పర దాడులు చేసుకున్నారు.
సంక్రాంతి సంబరాల్లో పాల్లొనేందుకు టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అమరావతి నుంచి హెలికాప్టర్ లో