Uniform Civil Codeకు వ్యతిరేకంగా ఉద్యమం...ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ
ABN , First Publish Date - 2022-06-01T15:52:18+05:30 IST
దేశంలో యూనిఫాం సివిల్ కోడ్ అమలుకు తమ ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) పార్టీ వ్యతిరేకమని...
రాజస్థాన్ రాష్ట్రంలో ఎంఐఎం శాఖ ప్రారంభం
జైపూర్(రాజస్థాన్): దేశంలో యూనిఫాం సివిల్ కోడ్ అమలుకు తమ ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) పార్టీ వ్యతిరేకమని ఆ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు. ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ జైపూర్‌లో రాజస్థాన్ పార్టీ యూనిట్‌ను ప్రారంభించారు.‘‘భారతదేశం భిన్నత్వానికి ప్రసిద్ధి. ఆ వైవిధ్యాన్ని మనం నిలుపుకోవాలి. ఏఐఎంఐఎం యూనిఫాం సివిల్ కోడ్ విధింపునకు అనుకూలం కాదు. గోవా వంటి అనేక చోట్ల హిందువుల కోసం నిబంధనలు రూపొందించారు... బీజేపీ యూనిఫాం సివిల్ కోడ్ అమలు కోసం ఆ నిబంధనలను తొలగించడానికి సిద్ధంగా ఉన్నారా?’’ అని ఒవైసీ ప్రశ్నించారు.2023లో జరగనున్న రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని తమ పార్టీ భావిస్తోందని ఒవైసీ చెప్పారు.
అయితే మజ్లిస్ పార్టీ పోటీ చేసే మొత్తం సీట్ల సంఖ్య, రాష్ట్రంలో ఏదైనా పార్టీతో రాజకీయ పొత్తు పెట్టుకుంటుందా అనే దానిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ఒవైసీ చెప్పారు. గుజరాత్ ఎన్నికల్లో ఏఐఎంఐఎం పోటీ చేస్తుందని అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు.రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రాజస్థాన్‌లో పోరాడాలని తాము నిర్ణయించుకున్నామన్నారు.జ్ఞాన్‌వాపి మసీదుకు సంబంధించిన అంశానికి సంబంధించి, ఇటీవల వెలువడిన వీడియోలను ప్రసారం చేయాలనే సుప్రీంకోర్టు ఆదేశాలకు ఇది విరుద్ధమని ఒవైసీ పేర్కొన్నారు.