Student: ఎర్రకోటలో స్వాతంత్య్ర వేడుకలకు కంప్లి విద్యార్థిని
ABN , First Publish Date - 2022-08-12T18:51:06+05:30 IST
దేశ రాజధానిలో జరిగే స్వాతంత్య్ర సంబరాలకు జిల్లా విద్యార్థిని ఎంపికయ్యింది. ఈ నెల 15న ఢిల్లీలో జరిగే 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు కంప్లి
కంప్లి(బెంగళూరు), ఆగస్టు 11: దేశ రాజధానిలో జరిగే స్వాతంత్య్ర సంబరాలకు జిల్లా విద్యార్థిని ఎంపికయ్యింది. ఈ నెల 15న ఢిల్లీలో జరిగే 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు కంప్లి పట్టణానికి చెందిన బసప్ప కుమార్తె సాయి తేజశ్విని ఎన్సిసి బెటాలియన్ భాగం నుంచి గోవా, కర్ణాటక(Goa, Karnataka) డైరెక్టర్గా నియమితులయ్యారు. తొలిసారి కంప్లి విద్యార్థికి ఈ అవకాశం దక్కడం హర్షణీయమని కళాశాల ప్రిన్సిపాల్ ప్రభయ్య, ఛైర్మన్ నాగరాజు, కెప్టెన్ ప్రభుస్వామి హర్షం వ్యక్తం చేశారు. ఈ విద్యార్థిని విజయనగర జిల్లా హోస్పేట(Vijayanagar District Hospet) విజయనగర కళాశాలలో బీఎస్సీ రెండవ సంవత్సరం పూర్తి చేసుకుంది. 34 కర్ణాటక ఎన్సీసీ బెటాలియన్ విభాగం నుంచి ఢిల్లీలో జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో పాల్గొననుండటంతో తోటి విద్యార్థులు, తల్లిదండ్రులు, కళాశాల సిబ్బంది, పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.