Kerala: కేరళలో బర్డ్ ఫ్లూ కలకలం

ABN , First Publish Date - 2022-12-15T11:53:38+05:30 IST

కేరళ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. కొట్టాయం జిల్లాలోని అర్పూకర, తలయాజమ్ గ్రామాల్లో బర్డ్ ఫ్లూ వ్యాప్తి...

Kerala: కేరళలో బర్డ్ ఫ్లూ కలకలం
Bird flu

తిరువనంతపురం(కేరళ): కేరళ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. కొట్టాయం జిల్లాలోని అర్పూకర, తలయాజమ్ గ్రామాల్లో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందింది.(Bird Flu Outbreak)దీంతో ప్రభావిత ప్రాంతాలకు ఒక కిలోమీటరు పరిధిలో ఉన్న 8వేల బాతులు, కోళ్లు ,ఇతర పెంపుడు పక్షులను చంపాలని అధికారులు ఆదేశించారు. జిల్లా కలెక్టర్ పీకే జయశ్రీ అధ్యక్షతన అత్యవసర సమావేశం నిర్వహించి గ్రామాల్లో క్రిమిసంహారక చర్యలు చేపట్టాలని స్థానిక సంస్థలు, జంతుసంక్షేమ శాఖలను ఆదేశించారు.

బర్డ్ ఫ్లూ కేంద్రంగా ఉన్న 10 కిలోమీటర్ల పరిధిలో మూడు రోజుల పాటు కోడి, బాతు, పిట్ట, కోడి గుడ్లు, మాంసం అమ్మకాలు, దిగుమతిపై(Sale and Import of Chicken) నిషేధం(Ban) విధిస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అర్పూకరలోని డక్ ఫామ్‌లో, తలయాజమ్‌లోని బ్రాయిలర్ కోళ్ల ఫారమ్‌లో పక్షులు మరణించడంతో వాటి నమూనాలను పరీక్షల కోసం భోపాల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ ల్యాబ్‌కు పంపారు.కేరళ (Kerala)జంతు సంరక్షణ శాఖ, స్థానిక సంస్థలు, రెవెన్యూ, పోలీసు, అటవీ శాఖ, ఆరోగ్య శాఖ, అగ్నిమాపక శాఖల సమన్వయంతో బర్డ్ ఫ్లూ నివారణకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు.

Updated Date - 2022-12-15T12:05:18+05:30 IST