చైనాలో కొవిడ్ కల్లోలం.. ఆస్పత్రుల్లో జనం క్యూ
ABN , First Publish Date - 2022-12-16T01:04:28+05:30 IST
చైనాలో కొవిడ్ విజృంభిస్తోంది. ప్రభుత్వం జీరో కొవిడ్ పాలసీకి స్వస్తి చెప్పిన తర్వాత అక్కడ కేసులు భారీసంఖ్యలో పెరుగుతున్నాయి.
బీజింగ్, డిసెంబరు 15: చైనాలో కొవిడ్ విజృంభిస్తోంది. ప్రభుత్వం జీరో కొవిడ్ పాలసీకి స్వస్తి చెప్పిన తర్వాత అక్కడ కేసులు భారీసంఖ్యలో పెరుగుతున్నాయి. బీజింగ్ సహా పలు ప్రధాన నగరాలలో కొవిడ్ కేసులు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. ప్రజలు తీవ్రమైన జ్వరం, ఇతర అనారోగ్య సమస్యలతో ఆస్పత్రుల ముందు క్యూ కడుతున్న దృశ్యాలు అక్కడి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. చైనాలో ఇప్పుడు ఉన్నది ఒమైక్రాన్ వేరియంట్ అని ఇది డెల్టా అంత ప్రమాదకరమైంది కాదని ఎపిడమియాలజిస్టులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా జీరో కొవిడ్‌పై ఆందోళనల వెనుక విదేశీ శక్తుల హస్తం ఉందని చైనా రాయబారి లు షాయే ఆరోపించారు.