Cow's milk: ఆవిన్‌ నుంచి ‘డిలైట్‌’ ఆవు పాలు

ABN , First Publish Date - 2022-11-03T08:24:44+05:30 IST

ఆవిన్‌ సంస్థ ‘డిలైట్‌’ పేరిట 90 రోజులు నిల్వ ఉంచి వినియోగించే ఆవు పాలను(Cow's milk) పరిచయం చేసింది. ఈశాన్య

Cow's milk: ఆవిన్‌ నుంచి ‘డిలైట్‌’ ఆవు పాలు

పెరంబూర్‌(చెన్నై), నవంబరు 2: ఆవిన్‌ సంస్థ ‘డిలైట్‌’ పేరిట 90 రోజులు నిల్వ ఉంచి వినియోగించే ఆవు పాలను(Cow's milk) పరిచయం చేసింది. ఈశాన్య రుతుపవనాల ప్రారంభంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలతో రోడ్లపై నీరు చేరి జనజీవనం స్తంభించింది. వర్షాల కారణంగా ఇంట్లో నుంచి బయటకు వెళ్లలేని ప్రజలు ‘డిలైట్‌’ పాలు కొనుగోలు చేసి 90 రోజుల వరకు వినియోగించుకోవచ్చు. ఈ పాలు 500 మి.లీ రూ.30కి విక్రయిస్తున్నట్లు ఆవిన్‌ సంస్థ తెలియజేసింది.

Updated Date - 2022-11-03T08:24:47+05:30 IST