Delhi Excise policy: సిసోడియా మిత్రులకు ముందుగానే లీక్.. బీజేపీ సంచలన ఆరోపణ

ABN , First Publish Date - 2022-11-11T18:02:50+05:30 IST

న్యూఢిల్లీ: వివాదాస్పద ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ వ్యవహారంలో ఆమ్ ఆద్మీ పార్టీపై బీజేపీ విమర్శల దాడి కొనసాగుతోంది. తాజాగా మరో సంచలన ..

Delhi Excise policy: సిసోడియా మిత్రులకు ముందుగానే లీక్.. బీజేపీ సంచలన ఆరోపణ

న్యూఢిల్లీ: వివాదాస్పద ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ (Delhi Excise policy) వ్యవహారంలో ఆమ్ ఆద్మీ పార్టీపై బీజేపీ విమర్శల దాడి కొనసాగుతోంది. తాజాగా మరో సంచలన ఆరోపణ చేసింది. ఎక్సైజ్ పాలసీని ప్రభుత్వం ప్రకటించడానికి ముందే దానిని ఢిల్లీ మంత్రి మనీష్ సిసోడియా (Manish Sisodia) మిత్రులకు లీక్ చేశారని బీజేపీ జాతీయ ప్రతినిధి సంబిత్ పాత్ర (Sambit patra) ఆరోపించారు. శుక్రవారంనాడిక్కడ మీడియాతో ఆయన మాట్లాడూతూ, 2021 జూలై 5న ఎక్సైజ్ పాలసీని పబ్లిక్ చేశారని, అయితే ఆ పాలసీ ప్రతిని 2021 మే 31న మనీష్ సిసోడియా మిత్రులకు లీక్ చేశారని ఆరోపించారు. వీరిలో మాన్యుఫాక్చరర్స్, కార్టెల్స్ ఉన్నారని చెప్పారు. అడ్వాన్స్ పేమెంట్‌గా రూ.100 కోట్లు చెల్లించిన ఇద్దరు వ్యాపారులు ప్రస్తుతం అరెస్టయ్యారని ఆయన తెలిపారు.

ప్రస్తుతం రద్దయిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ‌లో మనీష్ సిసోడియా ఒక నిందితుడు కాగా, ఈ కేసులో అవకతవకలకు పాల్పడిన అభియోగాలపై ఇద్దరు ప్రైవేటు కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గత బుధవారం కస్టడీలోకి తీసుకుంది. వీరిలో లిక్కర్ కంపెనీ పెర్నాడ్ రిచర్డ్ జనరల్ మేనేజర్ బినయ్ బాబు, అరొబిందో ఫార్మా హోల్‌-టైమ్ డైరెక్టర్, ప్రమోటర్ పి.శరత్ చంద్ర రెడ్డి ఉన్నారు. ఈ ఇద్దరిలో ఒక ఎగ్జిక్యూటివ్ ఇంటిపై గతంలో తాము దాడి చేసినప్పుడు ఎక్సైజ్ పాలసీ ముసాయిదా దొరికినట్టు ఈడీ చెబుతోంది. ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతం మరో మనీలాండరింగ్ కేసులో జైలులో ఉన్న ఆప్ ఎమ్మెల్యే దుర్గేష్ పాఠక్, మంత్రి సత్యేంద్ర జైన్‌లను ఈడీ ప్రశ్నించింది. మరోవైపు, సీబీఐ సైతం ఈ కేసుకు సంబంధించి ఎంటర్‌టైన్‌మెంట్ బిజినెస్ కంపెనీ మాజీ సీఈఓ విజయ్ నాయర్‌ను, లిక్కర్ వ్యాపారి అభిషేక్ బోయిన్‌పల్లిని అరెస్టు చేసింది.

Updated Date - 2022-11-11T18:07:33+05:30 IST