Home » Delhi Excise Policy
న్యూఢిల్లీ ప్రజలకు, ఆమ్ ఆద్మీ పార్టీకి మధ్య నెలకొన్న దూరాన్ని తగ్గించుకొనేందుకు ఆ పార్టీ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అందుకోసం అక్టోబర్ 6వ తేదీన దేశ రాజధాని న్యూఢిల్లీలోని చత్రశాల్ స్టేడియంలో జనతా కా అదాలత్ కార్యక్రమాన్ని ఆయన నిర్వహిస్తున్నారు. ఇదే కార్యక్రమాన్ని సెప్టెంబర్ 22న జంతర్ మంతర్ వద్ద ఆయన నిర్వహించిన సంగతి తెలిసిందే.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇవాళ(మంగళవారం) గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్లో చేరారు. మంగళవారం ఉదయం వైద్య పరీక్షల కోసం కవిత ఆస్పత్రిలో చేరారు. ఈరోజు సాయంత్రానికి ఆమెకు వైద్య పరీక్షలు పూర్తికానున్నాయి.
న్యూఢిల్లీ పూసా రోడ్డులోని స్ర్పింగ్‌డేల్ హైస్కూల్‌లో అతిషి చదువుకున్నారు. 2001లో ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుంచి చరిత్రలో ఆమె బ్యాచిలర్ డిగ్రీని అందుకున్నారు. అనంతరం ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో చేరి.. చెవెనింగ్ స్కాలర్‌షిప్ అందుకున్నారు. 2003లో చరిత్రలో ఆమె ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేశారు.
2013లో ఆప్‌లో చేరి అంచెలంచెలుగా ఎదిగి చివరకు ముఖ్యమంత్రి పీఠాన్ని అతిషి అధిష్టించనున్నారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి మనీశ్ సిసోడియాకు ఆమె సలహాదారుగా వ్యవహరించారు. ఈ సమయంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే పాఠశాల్లోని మౌలిక సదుపాయాలు మెరుగు పరిచేందుకు అతిషి తీవ్రంగా కృషి చేశారు.
ఢిల్లీ సీఎం పదవికి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో అధికారిక బంగ్లాను మరో వారం రోజుల్లో ఆయన ఖాళీ చేయనున్నారు. న్యూఢిల్లీలోని సివిల్ లైన్స్‌లో ఉన్న అధికార బంగ్లాను ఆయన ఖాళీ చేయనున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది.
మద్యం కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ వ్యవహారంలో అరెస్టయి.. బెయిల్‌పై విడుదలైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన ముఖ్యమంత్రి పదవికి రెండు రోజుల్లో రాజీనామా చేయనున్నట్లు ఆయన ఆదివారం న్యూఢిల్లీలో ప్రకటించారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ వారసులు ఎవరు అనే అంశంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.
ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నట్లు అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. దీంతో ఆయన వారసులు ఎవరే ఓ చర్చ అయితే వాడి వేడిగా సాగుంది. అలాంటి వేళ ఢిల్లీ మంత్రి అతిషి పేరు కేజ్రీవాల్ వారసురాలిగా తెరపైకి వస్తుంది.
లిక్కర్ స్కామ్ కేసులో సుమారు అయిదున్నర నేలల పాటు జైలులో ఉన్న కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు పలు షరతులతో శుక్రవారంనాడు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆప్ కార్యకర్తల సంబరాల మధ్య తీహార్ జైలు నుంచి సాయంత్రం ఆయన విడుదలయ్యారు. కార్యకర్తలకు అభివాదాలు తెలుపుతూనే తన స్పందన తెలియజేశారు.
ఢిల్లీ మద్యం కుంభకోణం మనీ లాండరింగ్ వ్యవహారంలో అరెస్టయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు శుక్రవారం షరతులతో కూడిన బెయిలు మంజూరు చేసింది. అసలు సీఎం కేజ్రీవాల్‌కు ఈ కేసులో ఈడీ తొలుత ఎప్పుడు సమన్లు జారీ చేసింది.. ఎప్పుడు అరెస్ట్ చేసింది.. ఎప్పుడు బెయిల్ పై విడుదలయ్యారంటే..
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో(Delhi Liquor Scam) ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) జ్యుడీషియల్ కస్టడీని సెప్టెంబర్ 25 వరకు పొడగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు నిర్ణయించింది.