Deputy CM: మహారాష్ట్రలోని ఒక్క పల్లెనూ వదలం...
ABN , First Publish Date - 2022-11-24T11:40:05+05:30 IST
మహారాష్ట్రలోని ఓ చిన్నపల్లెను కూడా కర్ణాటకకు వదిలేది లేదని ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్(Deputy Chief Minister Devendra Fadnavis)
- డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్
బెంగళూరు, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): మహారాష్ట్రలోని ఓ చిన్నపల్లెను కూడా కర్ణాటకకు వదిలేది లేదని ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్(Deputy Chief Minister Devendra Fadnavis) స్పష్టం చేశారు. కర్ణాటకలో నివసించే మహారాష్ట్ర పోరాట నేతలకు పింఛన్ సౌలభ్యాన్ని కల్పిస్తామని, జత్ తాలూకాను కర్ణాటకలోకి విలీనం చే యాలని సీఎం బొమ్మై ప్రకటించిన మేరకు ముంబైలో బుధవారం దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. మహారాష్ట్రలో ఓ కాలనీ కూడా వదులుకునేందుకు సిద్ధంగా లేమన్నారు. మరాఠీలు అత్యధికంగా నివసిస్తున్న బెళగావి మాత్రమే కాదు కారవార, నిప్పాణి ప్రాంతాల్లోని గ్రామాలను మహారాష్ట్రలో విలీనం చేసుకునేందుకు పోరాటాలు చేస్తామన్నారు. రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు దశాబ్దాలకాలంగా సాగుతున్నాయి. పలు కమిటీలు సరిహద్దు వివాదంపై నివేదికలు ఇచ్చాయి. అయినా తరచూ గొడవలు సాగుతున్నాయి. ఏటా నవంబరు 1న కన్నడ రాజ్యోత్సవాల వేళ బెళగావిలో మహారాష్ట్ర ఏకీకరణ సమితి (ఎంఈఎస్) పార్టీ కార్యకర్తలు అడ్డుకుంటున్నారు. మరికొన్ని రోజుల్లోనే శాసనసభ సమావేశాలు ప్రారంభం కానుండగా ఉపముఖ్యమంత్రి స్థాయిలోని దేవేంద్ర ఫడ్నవీస్ వ్యాఖ్యలు బెళగావిలో ఉద్రిక్తతకు కారణమవుతాయనే భావిస్తున్నారు.