Dera Sacha Sauda:ఫరీద్‌కోట్‌లో కాల్పులు...డేరా అనుచరుడి మృతి

ABN , First Publish Date - 2022-11-10T10:57:59+05:30 IST

పంజాబ్ రాష్ట్రంలోని ఫరీద్‌కోట్‌లో గురువారం ఉదయం కాల్పులు జరిగాయి. ఫరీద్‌కోట్‌లో బైక్ పై వచ్చిన ఇద్దరు ...

Dera Sacha Sauda:ఫరీద్‌కోట్‌లో కాల్పులు...డేరా అనుచరుడి మృతి
Faridkot firing

చండీఘడ్ (పంజాబ్): పంజాబ్ రాష్ట్రంలోని ఫరీద్‌కోట్‌లో గురువారం ఉదయం కాల్పులు జరిగాయి. ఫరీద్‌కోట్‌లో బైక్ పై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని దుండగులు డేరా సచ్చాసౌదా(Dera Sacha Sauda) అనుచరుడు ప్రదీప్ సింగ్ ను కాల్చి చంపారు. ప్రదీప్ సింగ్ బర్గారీ హత్య కేసులో నిందితుడని పంజాబ్ పోలీసులు చెప్పారు.(Faridkot) ప్రదీప్ సింగ్ గురువారం ఉదయం తన దుకాణానికి వెళుతుండగా దాడి జరిగింది. ఈ కాల్పుల్లో మరో ముగ్గురు వ్యక్తులు కూడా గాయపడ్డారు. ‘‘ఈ రోజు జరిగిన కాల్పుల్లో ప్రదీప్ సింగ్ అనే వ్యక్తి మరణించగా, ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. అతని భద్రతా సిబ్బంది కూడా ఆగంతకులపై ప్రతీకార కాల్పులు జరిపారు. మేం సంఘటన స్థలంలో సీసీటీవీ ఫుటేజీని (CCTV footage)పరిశీలిస్తున్నాం,పరిస్థితి అదుపులో ఉంది’’ అని ఫరీద్‌కోట్ రేంజ్ ఐజి ప్రదీప్ కుమార్ యాదవ్ మీడియాకు చెప్పారు.

డేరా సచ్చా సౌదా అనుచరుడి హత్య ఘటనతో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ఎవరినీ అనుమతించబోమని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ అన్నారు.ప్రజలు శాంతియుతంగా ఉండాలని సీఎం కోరారు.‘‘పంజాబ్ రాష్ట్రం శాంతిని ప్రేమించే రాష్ట్రం, ఇక్కడ ప్రజల పరస్పరం సోదరభావంతో మెలుగుతుంటారు..పంజాబ్ రాష్ట్రంలో శాంతికి విఘాతం కలిగించడానికి ఎవరినీ అనుమతించం. రాష్ట్రంలో శాంతి,భద్రతలను కాపాడేందుకు సివిల్, పోలీసు అధికారులకు కఠినమైన సూచనలు చేశామని ముఖ్యమంత్రి మాన్ ట్వీట్ చేశారు.

Updated Date - 2022-11-10T10:59:12+05:30 IST