Madhya pradesh: ద్వారకాపీఠం శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి ఇకలేరు..

ABN , First Publish Date - 2022-09-11T23:50:23+05:30 IST

ద్వారకాపీఠ్ శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి సుదీర్ఘ అస్వస్థతతో ఆదివారంనాడు..

Madhya pradesh: ద్వారకాపీఠం శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి ఇకలేరు..

ఇండోర్: ద్వారకాపీఠ్ శంకరాచార్య (Dwarakapeeth Shankaracharya) స్వామి స్వరూపానంద సరస్వతి (Swamy Swaroopanand saraswati) సుదీర్ఘ అస్వస్థతతో ఆదివారంనాడు పరమపదించారు. 99 ఏళ్ల స్వరూపానంద సరస్వతి మధ్యప్రదేశ్‌లోని నర్సింగపూర్‌లో ఉన్న శ్రీథామ్ జోతేశ్వర్ అశ్రమ్‌లో మధ్యాహ్నం 3.30 గంటలకు తుది శ్వాస విడిచారు. 1924లో జన్మించిన శంకరాచార్య స్వామి 2018లో బృందావనంలో తమ 95వ జన్మదినం జరుపుకోగా, పరమేశ్వరుడు పార్వతీ దేవిని భార్యగా స్వీకరించిన రోజుకు గుర్తుగా ఉత్తర భారతదేశంలో ఘనంగా జరుపుకొనే హరియాలి తీజ్ రోజున ఆయన తన 99వ పుట్టినరోజు జరుపుకొన్నారు.


సియోని జిల్లా జబల్‌పూర్ సమీపంలోని డిఘోరి గ్రామంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో శంకరాచార్య జన్మించారు. 9వ ఏటనే ఇల్ల విడిచిపెట్టి, హిందూమత ఉద్ధరణకు నడుం బిగించారు. యూపీలోని వారణాసి చేరుకుని స్వామి కర్పత్రి మహరాజ్ వద్ద వేదాలు అభ్యసించారు. రివల్యూషనరీ సాధువుగా పేరున్న ఆయన స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని జైలుకు వెళ్లారు. అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం కృషి చేశారు.

Updated Date - 2022-09-11T23:50:23+05:30 IST