Agniveers:జమ్మూకశ్మీరులో అగ్నివీరుల శిక్షణ జనవరి 1 నుంచి ప్రారంభం
ABN , First Publish Date - 2022-12-27T07:01:19+05:30 IST
జమ్మూ, కాశ్మీర్‌కు చెందిన మొదటి బ్యాచ్ అగ్నివీరులకు వివిధ పోస్టుల కోసం శిక్షణ...
శ్రీనగర్ : జమ్మూ, కాశ్మీర్‌కు చెందిన మొదటి బ్యాచ్ అగ్నివీరులకు వివిధ పోస్టుల కోసం శిక్షణ జనవరి 1వతేదీ నుంచి ప్రారంభించనున్నారు.(Agniveers Army training) అగ్నివీర్స్ పోస్టుల కోసం పలువురు యువకులు భారత సైన్యంలో చేరారు.జమ్మూకశ్మీరులో అగ్నివీర్స్ మొదటి బ్యాచ్ శిక్షణ కార్యక్రమం తాజాగా ప్రారంభించాలని నిర్ణయించారు. అగ్నివీర్స్(Agniveers) పథకం కింద చేరిన యువకులకు శిక్షణ అనంతరం ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ విభాగాల్లో దేనిలోనైనా చేరవచ్చు. కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీరులో(Jammu and Kashmir) అగ్నివీర్స్ పథకం కింద ఎంపిక చేసిన అభ్యర్థులకు ఆర్మీ శిక్షణ తరగతులను ప్రారంభించనున్నారు.(First batch)
శారీరక పరీక్షలు, వైద్యపరీక్షలు, రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ లతో సహా కఠినమైన పరీక్షల తర్వాత 200మంది అభ్యర్థులను అగ్నివీరులుగా ఎంపిక చేశారు. అభ్యర్థులు శ్రీనగర్‌లోని ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్ నుంచి డిసెంబర్ 24న ఇండియన్ ఆర్మీలోని వివిధ రెజిమెంట్‌లకు చెందిన 30 శిక్షణా కేంద్రాలకు అగ్నివీర్స్ శిక్షణ కోసం పంపించారు. అభ్యర్థులు డిసెంబర్ 25 నుంచి 30వతేదీల మధ్య శిక్షణ కోసం రిపోర్ట్ చేయాలి. అగ్నివీరుల శిక్షణ జనవరి 1వతేదీ నుంచి ప్రారంభమవుతుందని ఆర్మీ అధికారి చెప్పారు. నాలుగేళ్ల పాటు అగ్నివీరులు దేశానికి సేవలు అందించనున్నారు.