China : చైనా మాజీ అధ్యక్షుడు జియాంగ్ జెమిన్ కన్నుమూత

ABN , First Publish Date - 2022-11-30T16:04:05+05:30 IST

చైనా మాజీ అధ్యక్షుడు జియాంగ్ జెమిన్ (Jiang Zemin) బుధవారం తుది శ్వాస విడిచారు.

China : చైనా మాజీ అధ్యక్షుడు జియాంగ్ జెమిన్ కన్నుమూత
Jiang Zemin

బీజింగ్ : చైనా మాజీ అధ్యక్షుడు జియాంగ్ జెమిన్ (Jiang Zemin) బుధవారం తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 96 సంవత్సరాలు. ల్యుకేమియా, వివిధ అవయవాల వైఫల్యం వల్ల ఆయన షాంఘైలో మధ్యాహ్నం 12.13 గంటలకు మరణించినట్లు చైనా ప్రభుత్వ మీడియా తెలిపింది. చైనా కమ్యూనిస్టు పార్టీ, పార్లమెంటు, కేబినెట్, సైన్యం ఆయన మరణాన్ని ధ్రువీకరిస్తూ చైనా ప్రజలకు ఓ లేఖను విడుదల చేశాయి. తీవ్ర విషాదంతో ఈ లేఖను రాసినట్లు పేర్కొన్నాయి.

కామ్రేడ్ జియాంగ్ జెమిన్ మరణం వల్ల కమ్యూనిస్టు పార్టీకి, సైన్యానికి, అన్ని రకాల దేశీయ వర్గాల ప్రజలకు పూడ్చడం సాధ్యంకానటువంటి నష్టం జరిగినట్లు తెలిపాయి. తమ ఆత్మీయ కామ్రేడ్ జియాంగ్ జెమిన్ అసాధారణ నేత అని, అత్యున్నత స్థాయి గౌరవనీయుడని తెలిపాయి. ఆయన గొప్ప మార్క్సిస్ట్, వక్త, మిలిటరీ స్ట్రాటజిస్ట్, దౌత్యవేత్త, సుదీర్ఘ పరీక్షలకు నిలిచిన కమ్యూనిస్ట్ యోధుడు అని పేర్కొన్నాయి.

Updated Date - 2022-11-30T16:04:10+05:30 IST